News September 11, 2025
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యత

AP: పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్) ప్రోగ్రామ్ బాధ్యతలను ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ప్రతి ఉద్యోగికి సగటున 3 క్లస్టర్‌లు కేటాయించింది. 1,08,311 మంది 2.14 లక్షల క్లస్టర్లలోని 21.56 లక్షల బంగారు కుటుంబాల బాధ్యతలను చూడాల్సి ఉంటుంది. మార్గదర్శులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ బంగారు కుటుంబాలకు సాయం అందేలా చూడాలి.
Similar News
News September 11, 2025
మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

* పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి.
* పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్‌ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.
News September 11, 2025
గ్రూప్-1పై జుడీషియల్ కమిషన్ వేయాలి: కేటీఆర్

TG: హైకోర్టు ఆదేశించినట్టు గ్రూప్-1 పరీక్షను మళ్లీ తాజాగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసింది. అవకతవకలపై జుడీషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న మోసపూరిత వాగ్దానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
News September 11, 2025
స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే..

ప్రెగ్నెన్సీలో చర్మం సాగి స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడతాయి. వీటిని తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్స్, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్లు, జింక్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఆలివ్ఆయిల్ మసాజ్, యాంటీఆక్సిడెంట్ క్రీములు రాస్తే వీటి ప్రభావం చాలావరకు తగ్గుతుంది. ప్రసవం తర్వాత రెటినాల్, కొలాజిన్,జోజోబా ఆయిల్, కోకో బటర్, విటమిన్ ఇ, గ్లైకాలిక్ యాసిడ్ క్రీములు వాడాలి. వీటితోపాటు మైక్రోడెర్మాబ్రేషన్ చేయించుకోవచ్చు.