News August 12, 2024
సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. అలా చేస్తే సిమ్ బ్లాక్

నకిలీ, స్పామ్ కాల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్ అమలు చేయనుంది. వ్యక్తిగత ఫోన్ నంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చాలని TRAI స్పష్టం చేసింది.
Similar News
News November 18, 2025
CCRHలో 90 పోస్టులు.. అప్లై చేశారా?

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH ) 90 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఈ నెల 26 వరకు అప్లై చేసుకోవచ్చు. రీసెర్చ్ ఆఫీసర్, Jr లైబ్రేరియన్, MLT, LDC, స్టాఫ్ నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc(నర్సింగ్), ఎంఫార్మసీ, MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

కోర్టులు, విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. పటియాలా హౌస్, సాకేత్, రోహిణి కోర్టులతోపాటు పలు స్కూళ్లు, కాలేజీల్లో బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ చేశారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్స్‌తో తనిఖీలు చేస్తున్నాయి. ముందుజాగ్రత్తగా కోర్టులు, విద్యాసంస్థల్లో సిబ్బందిని, విద్యార్థులను బయటకు పంపించాయి. కాగా ఇటీవల ఎర్రకోట దగ్గర ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే.