News August 12, 2024
సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. అలా చేస్తే సిమ్ బ్లాక్
నకిలీ, స్పామ్ కాల్స్‌ను దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి TRAI కొత్త రూల్ అమలు చేయనుంది. వ్యక్తిగత ఫోన్ నంబర్ నుంచి మార్కెటింగ్, ప్రమోషనల్ కాల్స్ చేస్తే టెలికం ప్రొవైడర్ ఆ నంబర్‌ను రెండేళ్లు బ్లాక్ చేయాలని ఆదేశించింది. స్పామ్ కాల్స్ పేరుతో మోసాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అటు స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌కు భారీగా కనెక్షన్లు వాడే సంస్థలను బ్లాక్‌లిస్టులో చేర్చాలని TRAI స్పష్టం చేసింది.
Similar News
News September 14, 2024
మగ పిల్లలనే కబళించే భయంకరమైన వ్యాధి?
డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD) వ్యాధి ఎక్కువగా మగపిల్లలకే సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కారణంగా కండరాల క్షీణత, శ్వాసకోస సమస్యలు, నడవలేకపోవడం వంటివి ఎదుర్కొంటారు. దీనికి చికిత్స అందుబాటులో లేదు. కొంతకాలం జీవించి చనిపోతారు. ఈ వ్యాధి సోకిన వారు యుక్త వయసుదాటి బతకడం కష్టమే. ఇటీవల తెలంగాణకు చెందిన ఇద్దరు అన్నదమ్ములకు ఈ వ్యాధి సోకింది. ఒకే తల్లికి పుట్టిన తోబుట్టువులకు 99% ఇది సోకుతుంది.
News September 14, 2024
జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు
AP: నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై DGP ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో ఈ కేసును డీల్ చేసిన ACP కె.హనుమంతరావు, CI ఎం.సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు CIలు, ఒక SI పాత్ర ఉందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపైనా చర్యలు తీసుకుంటారని సమాచారం. కాగా నిన్న ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై జెత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News September 14, 2024
1, 2 అంతస్తుల్లో ఉన్నవారికీ వరద సాయం
AP: రాష్ట్రంలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న వరద ముంపు బాధితులకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నవారికి కూడా సాయం అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపైన ఉన్న అంతస్తుల వారికీ కొంత సాయం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించనున్నారు.