News November 30, 2024

నేటి నుంచి తిరుమలలో కొత్త రూల్

image

AP: నేటి నుంచి తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమలవుతుందని టీటీడీ ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Similar News

News October 19, 2025

బౌద్ధుల దీపావళి.. ఎలా ఉంటుందంటే?

image

దీపావళి బౌద్ధుల పండుగ కానప్పటికీ వజ్రయాన శాఖకు చెందినవారు దీన్ని వేడుకగా జరుపుకొంటారు. నేపాల్‌లోని ‘నేవార్’ ప్రజలు ‘తిహార్’ పేరుతో 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ స్వేచ్ఛ కోసం ఏ దేవతనైనా ఆరాధించవచ్చనే ఆచారం ప్రకారం వీరు లక్ష్మీదేవిని, విష్ణువును తమ దైవాలుగా భావించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా లక్ష్మీదేవిని ప్రార్థించడం ద్వారా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.

News October 19, 2025

DRDOలో 50 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

DRDO ఆధ్వర్యంలోని ప్రూప్& ఎక్స్‌పెరిమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 50 అప్రెంటిస్‌లకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. BE/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.isro.gov.in/

News October 19, 2025

‘K-Ramp’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని తెరకెక్కించిన ‘K-Ramp’ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు డీసెంట్ కలెక్షన్స్ రాబట్టినట్లు Sacnilk ట్రేడ్ వెబ్‌సైట్ తెలిపింది. ఇండియాలో రూ.2.15 కోట్లు(నెట్ కలెక్షన్స్) వసూలు చేసినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 37.10% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు వెల్లడించింది.