News May 12, 2024
ఇన్సూరెన్స్ సేవలపై కొత్త రూల్

లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు తమ సేవలను గ్రామ పంచాయతీలకు విస్తరించడం తప్పనిసరి చేస్తున్నట్లు IRDAI ప్రకటించింది. ‘2047 కల్లా అందరికీ బీమా’ అనే లక్ష్యంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త నిబంధనను అమల్లోకి తేనుంది. ఇందులో భాగంగా ప్రతీ బీమా కంపెనీకి నిర్దిష్ట సంఖ్యలో గ్రామాలను అప్పజెప్పి, పరస్పర అంగీకారంతో మార్కెట్ వాటా తదితర అంశాలను లెక్కవేస్తారు. అందుకు అనుగుణంగా కంపెనీలు సేవలను విస్తరిస్తాయి.
Similar News
News April 17, 2026
VIRAL: ఇన్‌ఫ్లుయెన్సర్ బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్

ఇన్‌స్టాలో జర్మనీ ఇన్‌ఫ్లుయెన్సర్ Lizlaz బోల్డ్ ఫొటోకు కింగ్ కోహ్లీ లైక్ కొట్టడం SMలో వైరల్‌గా మారింది. అయితే ఇది అనుకోకుండా జరిగిందా లేక అల్గారిథమ్ కారణంగానా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అల్గారిథమ్ వల్లేనని స్పిన్నర్ చాహల్ కామెంట్ చేయడం గమనార్హం. ఇక గతంలోనూ బాలీవుడ్ నటి అవ్‌నీత్ కౌర్ ఫొటోకు కోహ్లీ లైక్ కొట్టడం నెట్టింట వైరల్ కాగా అందుకు అల్గారిథమే కారణమని విరాట్ తర్వాత క్లారిటీ ఇచ్చారు.
News April 17, 2026
గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని మృతి

TG: మాంసం ముక్క వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబ్‌నగర్(D)లో జరిగింది. మూసాపేట(M) సంకలమద్దికి చెందిన అంజి(35) నిన్న రాత్రి కందూర్ స్టేజి వద్ద హోటల్లో బిర్యానీ తింటుండగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చనిపోగా అతనితో ఉన్న స్నేహితులు భయంతో డెడ్‌బాడీని వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇక మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. ఇటీవల మహబూబాబాబ్(D)లోనూ ఓ వ్యక్తి ఇలాగే చనిపోయాడు.