News August 4, 2024

వచ్చే ఏడాది హజ్ యాత్రకు కొత్త నిబంధనలు

image

TG: వచ్చే ఏడాది హజ్ యాత్రకు మక్కా వెళ్లేవారికి హజ్ కమిటీ కొత్త నిబంధనల్ని ప్రకటించింది. యాత్రికులకు పాస్‌పోర్టులో 2026 జనవరి 31 వరకు వాలిడిటీ, మెషీన్ రీడబిలిటీ ఉండాలని తెలిపింది. దానికి తగ్గట్టుగా యాత్రికులు తమ పాస్‌పోర్టుల్ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. 2025 జులై చివర్లో లేదా ఆగస్టు తొలివారంలో హజ్ యాత్ర ఉండనుంది. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 11,378మంది మక్కాకు వెళ్లారు.

Similar News

News October 23, 2025

ఏపీలో హైస్పీడ్ రైళ్లు రయ్…రయ్…

image

AP: రానున్న రోజుల్లో రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు పరుగెత్తనున్నాయి. కేంద్రం చేపట్టే 2 హైస్పీడ్ రైల్ కారిడార్లు AP మీదుగా వెళ్లనున్నాయి. HYD-చెన్నై కారిడార్ పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో 263 KM మేర వెళ్లనుంది. HYD-బెంగళూరు కారిడార్ కర్నూలు, నంద్యాల, ATP, సత్యసాయి జిల్లాల్లో 504 KM మేర వెళ్తుంది. ఈ రూట్లలో 15 స్టేషన్లు ఏర్పాటుకానుండడంతో జర్నీటైమ్ తగ్గనుంది.

News October 23, 2025

సోయా పంట కొనుగోలు ఎప్పుడు?

image

TG: ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 62,500 ఎకరాల్లో సోయా పంటను రైతులు సాగు చేశారు. చాలా ప్రాంతాల్లో పంట చేతికొచ్చి 15 రోజులు దాటింది. ఏటా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. పంట సేకరిస్తుండగా ఈ ఏడాది ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సోయాకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.5,328గా ఉంది. వర్షాలతో కొంత పంట నష్టపోయామని, మిగిలిన పంటనైనా ప్రభుత్వం త్వరగా కొనాలని రైతులు కోరుతున్నారు.

News October 23, 2025

నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్.. సీఎస్‌కు సమ్మె నోటీసు

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని సీఎస్‌కు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్ (FATHI) హెచ్చరించింది. టోకెన్లు ఇచ్చి రూ.900 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. దీపావళికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.