News August 30, 2024
ఎల్లుండి నుంచి కొత్త రూల్స్
* ఇతర కార్డుల మాదిరి SEP 1 నుంచి రూపే కార్డులకు, వాటితో చేసే UPI లావాదేవీలకూ రివార్డులు తదితర ప్రయోజనాలు అందనున్నాయి.
* మోసపూరిత కాల్స్, వెబ్‌సైట్ లింకులు, ఏపీకే ఫైల్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన సందేశాలు వినియోగదారులకు పంపించకూడదని టెలికం సంస్థలను ట్రాయ్ ఆదేశించింది.
* HDFC క్రెడిట్ కార్డ్ యూజర్లు ఇకపై నెలకు 2,000 పాయింట్లు మాత్రమే పొందగలరు.
* గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం సవరించనుంది.
Similar News
News September 19, 2024
పవన్‌తో ముగిసిన బాలినేని, సామినేని భేటీ
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో వైసీపీ మాజీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ ముగిసింది. ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్లు ఉదయభాను ప్రకటించారు. జనసేన బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మరోవైపు త్వరలో ఒంగోలులో కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్‌ను ఆహ్వానించి జనసేనలో చేరతానని బాలినేని తెలిపారు. అందరినీ కలుపుకుని ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
News September 19, 2024
వరదల తర్వాత అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయింది: VSR
AP: విజయవాడ వరదల తర్వాత రాజధాని అమరావతిపై ప్రజలకు నమ్మకం పోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బుడమేరు వరదలు, అమరావతి భవిష్యత్‌పై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఒకరి కల కోసం రాష్ట్రానికి కోట్లు ఖర్చు చేసే స్థోమత లేదు. పెట్టుబడి దారుల విశ్వాసం సన్నగిల్లింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ సాహసించడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
News September 19, 2024
ఆ సంస్థ ఉద్యోగులకు ఇండియా హెడ్ మెయిల్
పనిఒత్తిడి కారణంగా 26 ఏళ్ల CA మృతి చెందిన ఘటనపై EY సంస్థ India ఛైర్మన్ రాజీవ్ మేమాని ఉద్యోగులకు పంపిన మెయిల్ వెలుగులోకొచ్చింది. సంస్థలో బాధితురాలి ప్రయాణం తక్కువ కాలంలోనే ముగిసిందని, ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు తనకు రాసిన లేఖను సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగులకు ఆరోగ్యకరమైన, సమతుల్య పని వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.