News April 24, 2024

త్వరలోనే భారత్‌కు కొత్త షూ సైజింగ్ సిస్టమ్!

image

ప్రస్తుతం దేశంలో చెలామణిలో ఉన్న యూకే, యూఎస్, యూరోపియన్ షూ సైజింగ్ సిస్టమ్స్‌ను త్వరలోనే ‘Bha’ (భా) అనే కొత్త వ్యవస్థ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్ష మందిపై కేంద్రం సర్వే చేసిందట. పశ్చిమ దేశాల కన్నా భారతీయుల పాదాలు కాస్త వెడల్పుగా ఉన్నట్లు సర్వేలో తేలింది. UK/US/EU సైజులు సరిగ్గా సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారట. ఈ నేపథ్యంలో కొత్త సైజులతో వీటిని భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Similar News

News December 16, 2025

భూపాలపల్లి కలెక్టర్ ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకొని డబ్బులకు ఎర..!

image

వాట్సాప్‌లో తన ఫొటోను ఉపయోగించి డబ్బులు పంపాలని కోరుతూ కొందరు దుండగులు నకిలీ సందేశాలు పంపిస్తుండటంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఇలాంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించి, లావాదేవీలు జరుపొద్దని ఆయన కోరారు. ఇలాంటి వాటిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

News December 16, 2025

CTETకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే లాస్ట్ డేట్

image

CTETకు అప్లై చేయడానికి ఎల్లుండి వరకే అవకాశం ఉంది. B.Ed, D.Ed, B.EI.Ed, D.EI.Ed అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఏకలవ్య స్కూల్స్‌, రాష్ట్ర స్థాయిలో టీచర్ ఉద్యోగాలకు పోటీపడాలంటే CTET తప్పనిసరి. FEB 8న పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, రెండు పేపర్లకు రూ.1200. SC/ST/ PWBDలకు రూ.500, రెండు పేపర్లకు రూ.600. వెబ్‌సైట్: ctet.nic.in/

News December 16, 2025

హనుమాన్ చాలీసా భావం – 40

image

తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా ||
భావం: ‘తులసీదాసు వలె నేను కూడా నీ పరమ భక్తుడని హనుమా! కాబట్టి నా హృదయాన్ని కూడా నీ నివాసంగా చేసుకో. నాపై కరుణ చూపి నన్ను అనుగ్రహించు. నీ అపారమైన శక్తితో నన్ను కాపాడు. భయాలను, దోషాలను తొలగించు స్వామీ!’
హనుమాన్ చాలీసా ఇంతటితో పూర్తైంది. మొదటి శ్లోకం నుంచి భావాన్ని తెలుసుకోవడానికి <<-se>>#HANUMANCHALISA<<>> హ్యాష్‌ట్యాగ్‌ను క్లిక్ చేయండి.