News March 24, 2024

ఆ తరగతులకు కొత్త సిలబస్: CBSE

image

వచ్చే విద్యా సంవత్సరంలో(2024-25) 3, 6 తరగతులకు సిలబస్ మారనుందని సీబీఎస్ఈ వెల్లడించింది. మిగిలిన తరగతుల సిలబస్‌లో మార్పులు ఉండవని స్పష్టం చేసింది. కొత్త సిలబస్‌తో పాటు పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేస్తామని NCERT సమాచారమిచ్చినట్లు పేర్కొంది. ఆరో తరగతిలో అదనంగా బ్రిడ్జి కోర్సు ఉంటుందని, స్కూళ్లన్నీ కొత్త సిలబస్‌ను అనుసరించాలని సూచించింది.

Similar News

News September 14, 2025

పరిమిత స్థాయిలోనే యురేనియం అవశేషాలు: అధికారులు

image

AP: <<17705296>>తురకపాలెం<<>>లో నీటిలో పరిమిత స్థాయిలోనే యురేనియం అవశేషాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. తాగు నీటిలో యురేనియం లీటరుకు 30 మైక్రో గ్రాములు(0.03 mg/l)గా ఉంటుందని, తురకపాలెంలో యురేనియం ఆనవాళ్లు 0.001 mg/l కంటే తక్కువగా ఉన్నట్లు తేలిందన్నారు. కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గత రెండు రోజులుగా కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదన్నారు.

News September 14, 2025

OG: డబ్బింగ్ పూర్తి చేసిన పవన్

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ‘OGని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ముగించారు’ అని పేర్కొంటూ పవన్ ఫొటోలను షేర్ చేసింది. అంతకుముందు డైరెక్టర్ సుజిత్, తమన్‌తో పవన్ ఉన్న ఫొటోను పంచుకుంది. ‘మిలియన్ డాలర్ పిక్చర్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. OG లోగోతో ఉన్న డ్రెస్‌ను పవన్ ధరించడం గమనార్హం. ఈ మూవీ SEP 25న రిలీజ్ కానుంది.

News September 14, 2025

ఒకే కాన్పులో నలుగురు బిడ్డలు… మొత్తం ఏడుగురు..

image

మహారాష్ట్రలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురికి(క్వాడ్రాప్లెట్స్) జన్మనిచ్చింది. పుణే జిల్లాలోని సస్వద్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ సతారా ఆస్పత్రిలో పురిటినొప్పులతో చేరారు. అక్కడ వైద్యులు ఆమెకు కాన్పు చేయగా ఓ మగ, ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఒకే కాన్పులో నలుగురు పుట్టడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. కాగా ఆ మహిళకు గతంలోనూ ట్విన్స్ పుట్టారు. మరో బాలుడు కూడా ఉన్నారు. మొత్తం ఏడుగురికి ఆమె జన్మనిచ్చింది.