News June 23, 2024

ఈనెల 26 నుంచి అమల్లోకి కొత్త టెలికం చట్టం

image

దేశంలో కొత్త టెలికం చట్టం-2023 ఈనెల 26 నుంచి అమల్లోకి రానుంది. దీని ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ నెట్‌వర్క్‌నైనా ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకునే అధికారం ఉంటుంది. ప్రజల భద్రత ప్రయోజనాల కోసం టెలికమ్యూనికేషన్ సేవల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రభుత్వాల తరఫున నియమితులైన స్పెషల్ ఆఫీసర్లకు కూడా ఈ అధికారం ఉంటుంది.

Similar News

News November 12, 2025

ఐరన్, క్యాల్షియం ట్యాబ్లెట్లు ఎలా తీసుకోవాలంటే?

image

హిమోగ్లోబిన్‌ తయారీలో ఐరన్‌, ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం అత్యవసరం. అందుకే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, నెలసరి నిలిచిన మహిళలు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అయితే ఈ రెండిటినీ ఒకేసారి తీసుకుంటే శరీరం ఐరన్‌ను గ్రహించుకోకుండా క్యాల్షియం అడ్డుపడుతుంది. ఐరన్‌ పరగడుపున బాగా ఒంట పడుతుంది కాబట్టి భోజనానికి ముందు తీసుకుంటే మంచిది. క్యాల్షియాన్ని భోజనంతో పాటు తీసుకోవచ్చు.

News November 12, 2025

వారితో మాకు సంబంధం లేదు: అల్ ఫలాహ్ యూనివర్సిటీ

image

ఢిల్లీ <<18265346>>ఎర్రకోట <<>>వద్ద పేలుడు కేసులో ప్రధాన నిందితులు అల్ ఫలాహ్ వర్సిటీ డాక్టర్లేనని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వర్సిటీ VC భూపిందర్ కౌర్ తెలిపారు. డాక్టర్లు ముజామిల్, షాహీన్‌తో తమకు సంబంధం లేదన్నారు. ‘మేం ఎలాంటి రసాయనాలు నిల్వ చేయట్లేదు. ఉపయోగించట్లేదు. స్టూడెంట్ల అకడమిక్, ట్రైనింగ్ కోసం అవసరమైనంత వాడుతున్నాం’ అని పేర్కొన్నారు.

News November 12, 2025

ప్లాన్ చేసి ప్రిపేర్ అయితే.. ప్రభుత్వ ఉద్యోగం పక్కా

image

ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగానికి నిర్వహించే రాత, ఫిజికల్, మెడికల్ టెస్టుల్లో పాస్ కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. సమయపాలన ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మాక్ టెస్టులు ఎక్కువగా రాయాలి. పోలీస్, ఆర్మీ, బీఎస్‌ఎఫ్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్‌పై శ్రద్ధపెట్టాలి.