News December 7, 2024
డిసెంబర్ 31లోగా కొత్త పర్యాటక విధానాన్ని తయారు చేయాలి: CM
TG: కొత్త పర్యాటక విధానాన్ని ఈనెల 31లోగా తయారు చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి దుబాయ్, సింగపూర్, చైనా వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలను స్టడీ చేయాలన్నారు. పర్యాటక విధానం రూపకల్పనపై సమీక్షించిన ఆయన, గత పదేళ్లలో ప్రత్యేకమైన పాలసీ లేకపోవడం వల్ల నష్టపోయామన్నారు. పర్యాటక శాఖ స్థలాల లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News February 5, 2025
టెట్ ఫలితాలు వాయిదా
TG: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ విడుదల కావాల్సి ఉండగా, MLC ఎన్నికల కోడ్‌తో వాయిదాపడ్డాయి. తొలుత ప్రకటించాలని భావించినా, టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్, టీచర్లకు సంబంధించినది కావడంతో ఈసీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7 ఉమ్మడి జిల్లాల్లో(HYD, రంగారెడ్డి, MBNR మినహా) MLC కోడ్ అమల్లో ఉంది.
News February 5, 2025
కుంభమేళాకు ఫ్రీ ట్రైన్, ఫ్రీ ఫుడ్.. ఎక్కడంటే!
మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులకు గోవా గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాగ్‌రాజ్‌కు ఉచితంగా ప్రయాణించేందుకు 3 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. Feb 6, 13, 21 తేదీల్లో మడ్గాన్ నుంచి 8AMకు ఇవి బయల్దేరుతాయి. ప్రభుత్వమే ఫ్రీ భోజనం అందిస్తుంది. ప్రయాగకు వెళ్లాక మాత్రం బస, భోజనం భక్తులే చూసుకోవాలి. వెళ్లాక 24 గంటల్లో రిటర్న్ జర్నీ మొదలవుతుంది. మిగతా రాష్ట్రాలూ ఇలాంటి సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు.
News February 5, 2025
మహా కుంభమేళా: ప్రయాగ్‌రాజ్ చేరుకున్న మోదీ
ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే హెలీప్యాడ్ వద్దకు వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లో మోదీ కుంభమేళా ప్రాంతానికి వెళ్తారు. త్రివేణీ సంగమ స్థలిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. అలాగే హిందూ సంఘాలు, సాధుసంతులతో సమావేశమవుతారు.