News December 7, 2024
డిసెంబర్ 31లోగా కొత్త పర్యాటక విధానాన్ని తయారు చేయాలి: CM
TG: కొత్త పర్యాటక విధానాన్ని ఈనెల 31లోగా తయారు చేయాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి దుబాయ్, సింగపూర్, చైనా వంటి దేశాలు అమలు చేస్తున్న విధానాలను స్టడీ చేయాలన్నారు. పర్యాటక విధానం రూపకల్పనపై సమీక్షించిన ఆయన, గత పదేళ్లలో ప్రత్యేకమైన పాలసీ లేకపోవడం వల్ల నష్టపోయామన్నారు. పర్యాటక శాఖ స్థలాల లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News January 21, 2025
HEADLINES
*అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం
*కోల్‌కతా హత్యాచార దోషికి జీవిత ఖైదు
*లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్లు.. హైకమాండ్ ఆగ్రహం
*పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు: Dy.CM పవన్
*ఏపీలో 26 మంది IASలు, 27 మంది IPSలు బదిలీ
*స్విట్జర్లాండ్‌లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
*తెలంగాణలో మళ్లీ రానున్న కింగ్ ఫిషర్ బీర్లు
*రేవంత్‌కు చుక్కలు చూపెట్టాలి: KTR
News January 21, 2025
ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘నా మిత్రుడు డొనాల్డ్ ట్రంప్‌నకు శుభాకాంక్షలు. అధ్యక్షుడిగా పదవీకాలం విజయవంతంగా పూర్తి కావాలి. ఇరు దేశాల ప్రయోజనం కోసం కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.
News January 21, 2025
వారిని ప్రోత్సహించడంలో వివక్ష ఉండదు: ట్రంప్
అమెరికా భూభాగంపై తీవ్రవాద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ట్రంప్ అన్నారు. ‘నేరాలు చేసే ముఠాలతో కఠినంగా వ్యవహరిస్తాం. ఎలక్ట్రిక్ వాహనాలు అధికంగా తయారు చేస్తాం. అమెరికన్ డ్రీమ్ అనేది ప్రపంచ నలుమూలల్లోని ప్రతిభావంతుల కల. ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో వివక్ష ఉండదు. శాంతి నెలకొల్పేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తాం. నిన్న గాజాలో బందీలు విడుదల కావడం సంతోషంగా ఉంది’ అని ట్రంప్ వివరించారు.