News February 10, 2025

కొత్త వ్యాక్సిన్: పాడి రైతులకు గుడ్‌న్యూస్

image

భారత్ బయోటెక్‌కు చెందిన బయోవెట్ కంపెనీ పాడి రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ BIOLUMPIVAXIN®కు CDSCO లైసెన్స్ వచ్చినట్టు ప్రకటించింది. భారత్ సహా ప్రపంచంలోనే ఇదే తొలి DIVA మార్కర్, LSD టీకా అని కంపెనీ తెలిపింది. వ్యాధి సోకిన, టీకా వేసిన జీవాలను వేర్వేరుగా గుర్తించగలగడమే DIVA ప్రత్యేకత. మేకలు, బర్రెలు, ఆవులను వేధించే ముద్దచర్మం వ్యాధికి (Lumpy Skin Disease) ఇది ఉపయోగపడుతుంది.

Similar News

News January 8, 2026

నేడు YS జగన్ మీడియా సమావేశం

image

AP: YCP అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్, ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలపై జగన్ కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.

News January 8, 2026

మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

image

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 8, 2026

ఇతిహాసాలు క్విజ్ – 121

image

ఈరోజు ప్రశ్న: ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు కావడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>