News February 10, 2025
కొత్త వ్యాక్సిన్: పాడి రైతులకు గుడ్‌న్యూస్

భారత్ బయోటెక్‌కు చెందిన బయోవెట్ కంపెనీ పాడి రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ BIOLUMPIVAXIN®కు CDSCO లైసెన్స్ వచ్చినట్టు ప్రకటించింది. భారత్ సహా ప్రపంచంలోనే ఇదే తొలి DIVA మార్కర్, LSD టీకా అని కంపెనీ తెలిపింది. వ్యాధి సోకిన, టీకా వేసిన జీవాలను వేర్వేరుగా గుర్తించగలగడమే DIVA ప్రత్యేకత. మేకలు, బర్రెలు, ఆవులను వేధించే ముద్దచర్మం వ్యాధికి (Lumpy Skin Disease) ఇది ఉపయోగపడుతుంది.
Similar News
News February 14, 2026
రూ.3.32లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్

AP: 2026-27 ఆర్థిక సంవత్సరానికి మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,32,205కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ.53,915 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22,002కోట్లు, ద్రవ్య లోటు రూ.75,868కోట్లుగా పేర్కొన్నారు. అమరావతికి రూ.6వేల కోట్లను కేటాయించారు.
News February 14, 2026
వంటింటి చిట్కాలు మీ కోసం

* పూరీలు తెల్లగా ఉండాలంటే వాటిని వేయించే నూనెలో రెండు జామాకులు వేసి వేయించాలి.
* పకోడీ చేసేటప్పుడు పిండిలో కొద్దిగా పాలు పోసి కలిపితే కరకరలాడతాయి.
* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* ఆలూతో కలిపి నిల్వచేస్తే వెల్లుల్లి తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోవు.
News February 14, 2026
పాయిజన్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోబోయి..!

నలుగురు బాలికలు చేసిన వింత ప్రయోగం వారి ప్రాణాలను బలితీసుకుంది. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో ఐదుగురు స్నేహితులు సరదాగా పొలానికి వెళ్లి పక్షులను చంపే విషాన్ని నీళ్లలో కలుపుకొని తాగారు. నలుగురు అక్కడికక్కడే కుప్పకూలి చనిపోగా ఒక బాలిక వెంటనే ఉమ్మేయడంతో ప్రాణాలతో బయటపడింది. అయితే చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారని తల్లిదండ్రులు మందలించారనే బాధతో వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.


