News December 20, 2024

విద్యార్థులకు న్యూ ఇయర్ కానుక

image

AP: ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జనవరి నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదే ప్రాంగణంలో కలిసి ఉన్న లేదా సమీపంలోని హైస్కూళ్ల నుంచి మధ్యాహ్న భోజనం పంపనున్నారు. అలాగే పిల్లల్లో నైతిక విలువలు పెంచేలా ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందించనున్నారు.

Similar News

News January 16, 2025

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. సంచలన విషయాలు

image

హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడికి యత్నించిన నిందితుడు తొలుత అతడి కొడుకు జేహ్(4) బెడ్రూమ్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు FIR కాపీలో తెలిపారు. ‘బాబు సంరక్షణ కోసం ఉన్న నర్సు నిందితుడిని నిలువరించింది. దీంతో అతడు ఆమెపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. అలికిడి విని సైఫ్, కరీనా ఆ గదిలోకి వెళ్లారు. పెనుగులాటలో దుండగుడు సైఫ్‌ను కత్తితో పొడిచి పారిపోయాడు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సైఫ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

News January 16, 2025

J&Kలో మిస్టరీ: నెలన్నరలో ఒకే ఊరిలో 15 మంది మృతి

image

J&K రాజౌరీ(D)లోని బుధాల్‌లో మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. నెలన్నరలోనే 15 మంది చనిపోవడంతో ప్రభుత్వం SITను ఏర్పాటుచేసింది. DEC 7న విందు ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, DEC 12న మరో సహపంక్తి భోజనం చేసిన వారిలో ముగ్గురు, JAN 12న మరొకరు మృతిచెందారు. ఇలా పలు ఘటనల్లో 15 మంది చనిపోయారు. ఆహార, నీటి నమూనాల్లో విష పదార్థాలు ఉండటంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

News January 16, 2025

క్రెడిట్ కార్డు యూజర్లకు పోలీసుల సూచనలు

image

క్రెడిట్ కార్డు యూజర్లను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారు. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లపై బంపర్ ఆఫర్ అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకుల పేరిట వచ్చే మెసేజ్‌లను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని TG పోలీసులు సూచించారు. రివార్డు పాయింట్ల కోసం APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయొద్దన్నారు. అత్యాశకు వెళ్తే అకౌంట్ ఖాళీ అవుతుందని హెచ్చరించారు.