News October 8, 2025
న్యూస్ అప్‌డేట్స్ @12am

*తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. కీలకమైన సాక్ష్యాలు లభించాయన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. విచారణ అక్టోబర్ 14కు వాయిదా.
*సుప్రీంకోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 3కు వాయిదా
Similar News
News October 8, 2025
ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – వృషభాద్రి

తిరుమల కొండల్లో ఐదవది ‘వృషభాద్రి’. సాధన చేసే భక్తుడు ఏకాగ్రతతో ధ్యానించినప్పుడు, అతని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని చేరుకుంటుంది. అంటే.. దాదాపు 80% ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తైనట్లే. ఈ దశలో సంసార బంధాలన్నీ తెగిపోయి, మనస్సు బంధాలు లేని వృషభం(ఎద్దు) వలె కేవలం పరమాత్మ వైపే వేగంగా పరుగులు తీస్తుంది. ఈ శక్తిమంతమైన భావాన్ని సూచిస్తూనే ఈ కొండకు ‘వృషభాద్రి’ అనే దివ్య నామం వచ్చింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News October 8, 2025
పిల్లల ఫొటోలు తీస్తున్నారా? ఇలా చేయండి!

చాలామంది తమ పిల్లల బాల్యాన్ని, మధుర జ్ఞాపకాలను కెమెరాతో బంధించి కొద్దిరోజుల్లోనే డిలీట్ చేయడం చూస్తుంటాం. ఇంతదానికి ఫొటోలు తీయడం ఎందుకు? అలా చేయకుండా వారి పేరిట ఓ మెయిల్ క్రియేట్ చేసి అందులో స్టోర్ చేయొచ్చని పలువురు సూచిస్తున్నారు. వారి ఫొటోలు, వీడియోలను mailలో స్టోర్ చేసి యుక్త వయసు వచ్చాక వారికిస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదూ. మరి ఆలస్యమెందుకు.. ఇప్పుడే మెయిల్ క్రియేట్ చేసేయండి. SHARE IT
News October 8, 2025
కరూర్ తొక్కిసలాటపై రిషబ్ శెట్టి ఏమన్నారంటే?

తమిళనాడులో హీరో విజయ్ ర్యాలీలో చోటు చేసుకున్న <<17885395>>తొక్కిసలాట<<>> ఘటన దురదృష్టకరమని ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి అన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా పేర్కొన్నారు. ఇది ఒక్కరి తప్పు కాదని సమష్టి పొరపాటుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వంపై నింద వేయడం సులభమేనని, అంత జనం ఉన్నప్పుడు వారిని నియంత్రించడం సమస్యేనని పేర్కొన్నారు.