News March 28, 2025
NGKL: రేపు మహనీయుల జాతర సభ సన్నాహక సమావేశం: పృథ్వీరాజ్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జగ్జీవన్ రామ్ భవనంలో రేపు ఉదయం 10గంటలకు మహనీయుల జాతర సభ సన్నాహక సమావేశం ఉంటుందని బీఎస్పీ జిల్లా ఇన్‌ఛార్జి బండి పృథ్వీరాజ్ తెలిపారు. సమావేశం అనంతరం వాల్ పోస్టర్, కరపత్రం విడుదల కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, మండల, గ్రామ కమిటీల నాయకులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Similar News
News March 31, 2025
నేడు YV సుబ్బారెడ్డి తల్లి పెద్దకర్మ.!

తన తల్లి పిచ్చమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వగ్రామం మేదరమెట్లలో కాకుండా.. ఒంగోలులో సౌత్ బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పిచ్చమ్మ అల్లుడు.. మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.
News March 31, 2025
‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో..’ అంటూ ఆత్మహత్య

నిజామాబాద్(TG) విద్యార్థి రాహుల్ మాదాల చైతన్య అలహాబాద్ ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి జల్వాలోని హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సూసైడ్‌కు ముందు ‘నాన్న, తమ్ముడిని బాగా చూసుకో అమ్మా..’ అని తల్లికి మెసేజ్ పెట్టాడు. దివ్యాంగుడైన రాహుల్ JEE మెయిన్స్‌లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించారు.
News March 31, 2025
ఇల్లందకుంట: 4 నుంచి సీతారాముల బ్రహ్మోత్సవాలు

KNR జిల్లా ఇల్లందకుంట సీతారాములవారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏటా 13 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కళ్యాణం, పట్టాభిషేకం, చిన్న రథం, పెద్ద రథం మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలకు హనుమకొండ, భూపాలపల్లి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో వెళ్తారు. ప్రసుత్తం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.