News March 24, 2025
NGKL: ఎస్ఎల్బీసీ ఘటన.. సీఎం ఆదేశాలు

ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయకచర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌జీఆర్ఐ, జీఎస్ఐతో అధ్యయనం చేయించి, సొరంగంలో డ్రిల్, బ్లాస్ట్ విధానాన్ని ఉపయోగించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆ ఏడుగురికి పరిహారం చెల్లింపుపై ఓ నిర్ణయానికి రానున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని, తాత్కాలిక చర్యలే కాకుండా శాశ్వత చర్యలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News March 29, 2025
సోమవారం PGRS కార్యక్రమం రద్దు: కలెక్టర్

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేధిక’ కార్యక్రమాన్ని ఈ నెల తేదీ 31న సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఆ రోజు రంజాన్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించార.
News March 29, 2025
ఆదిలాబాద్: స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన SC విద్యార్థులకు 2025 విద్యా సంవత్సరానికి గాను విదేశాల్లో ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య నిధి” పథకం ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని SC సంక్షేమ శాఖ అధికారి సునీత పేర్కొన్నారు. ఈనెల 20 నుంచి మే 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 88869 76630 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
News March 29, 2025
ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలు క్యాన్సిల్!

అమెరికా యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాకిస్తోంది. యూనివర్సిటీల్లో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి వీసాలు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతున్నారు. అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన, లైక్ చేసిన విద్యార్థులకూ ఈ హెచ్చరికలు పంపింది. ఇందులో పలువురు భారతీయ విద్యార్థులూ ఉన్నట్లు తెలుస్తోంది.