News March 29, 2025
ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థుల వీసాలు క్యాన్సిల్!

అమెరికా యూనివర్సిటీల్లోని విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాకిస్తోంది. యూనివర్సిటీల్లో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి వీసాలు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతున్నారు. అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన, లైక్ చేసిన విద్యార్థులకూ ఈ హెచ్చరికలు పంపింది. ఇందులో పలువురు భారతీయ విద్యార్థులూ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 21, 2025
చమురు దిగుమతుల ఖర్చు ₹13.76L Cr

FY25లో భారత్ 24.24 కోట్ల టన్నుల క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. దీని విలువ ₹13.76 లక్షల కోట్లు. FY24తో పోలిస్తే 4.2% ఎక్కువ. మొత్తం దేశీయ చమురు అవసరాల్లో 89.1% దిగుమతుల ద్వారానే రావడం గమనార్హం. ఇదే సమయంలో దేశీయ చమురు ఉత్పత్తి 2.94 కోట్ల టన్నుల నుంచి 2.87 కోట్ల టన్నులకు తగ్గింది. గ్యాస్ దిగుమతి 15.4% పెరిగి 3,666MMSCM(మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్)కు చేరింది.
News April 21, 2025
IPL: ఇవాళ కీలక పోరు

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ GT, KKR మధ్య మ్యాచ్ జరగనుంది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఏడింట్లో 3 గెలిచి ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతా ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా GT 2, KKR ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. ఒకటి రద్దైంది. ఇవాళ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News April 21, 2025
ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.