News March 10, 2025
స్టార్ హీరో సినిమాలో నిధి అగర్వాల్?

యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్‌కు మూవీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తమిళ హీరో సూర్య సరసన ఈ అమ్మడు నటించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమాలో ఆమెను తీసుకుంటారని సమాచారం. నిధితో పాటు మరో అప్‌కమింగ్ హీరోయిన్ ఈ మూవీలో నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్‌తో ‘ది రాజాసాబ్’ చిత్రాల్లో నిధి నటిస్తున్నారు.
Similar News
News March 10, 2025
నేడు గ్రూప్-1 రిజల్ట్

TG: నేడు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. ఈ మేరకు ప్రొవిజనల్ మార్కుల జాబితాను రిలీజ్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.
News March 10, 2025
TDP సీనియర్లకు నిరాశ.. ముందుగానే ఫోన్లు

AP: MLA కోటా MLC సీటు ఆశించిన పలువురు TDP సీనియర్లకు నిరాశ ఎదురైంది. అయితే అభ్యర్థులను ప్రకటించక ముందే వారికి రాష్ట్ర TDP అధ్యక్షుడు పల్లా నుంచి ఫోన్లు వెళ్లాయి. ఏ కారణం వల్ల పరిగణనలోకి తీసుకోవట్లేదో వివరించి, భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామని CM మాటగా వివరించారు. దేవినేని ఉమ, పిఠాపురం వర్మ, KS జవహర్, మాల్యాద్రి, వంగవీటి రాధా, టీడీ జనార్దన్, దువ్వారపు రామారావు, అశోక్ బాబు తదితరులకు నచ్చజెప్పారు.
News March 10, 2025
నేటి నుంచి ధర్మపురి నృసింహుని బ్రహ్మోత్సవాలు

TG: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు జరగనున్నాయి. నేడు పుట్ట బంగారంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపు సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుకలు జరగనున్నాయి. 14, 15, 16 తేదీల్లో తెప్పోత్సవం, డోలోత్సవం, 16, 17, 18 తేదీల్లో స్వామివార్ల దక్షిణ, ఉత్తర దిగ్యాత్ర కార్యక్రమాలు చేపడతారు. 19న రథోత్సవం, 20, 21, 22 తేదీల్లో ఉత్సవమూర్తుల ఏకాంతోత్సవాలను జరిపిస్తారు.