News August 9, 2024
పాక్ టెస్ట్ జట్టు కోచ్‌గా నీల్సన్

పాకిస్థాన్ టెస్టు జట్టు హై ఫర్ఫార్మెన్స్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ టిమ్ నీల్సన్‌ను పీసీబీ నియమించింది. ఈ నెల 21 నుంచి బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే పాక్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా జాసన్ గిలెస్పీ ఉన్నారు. వీరిద్దరూ కలిసి జట్టును నడిపించనున్నారు. కాగా నీల్సన్ 2007 నుంచి 2011 వరకు ఆసీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించారు.
Similar News
News January 16, 2026
NTPCలో ఉద్యోగాలు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 16, 2026
కనుమ రోజు మినుము ఎందుకు తినాలి?

కనుమ పశువులకు, పితృదేవతలకు అంకితం చేసిన పండుగ. ఈరోజు చనిపోయిన పెద్దల కోసం పెట్టే ప్రసాదాల్లో గారెలు ప్రధానమైనవి. వీటిలో పోషకాల విలువలు ఎక్కువ. చలికాలంలో శరీరానికి అవసరమైన వేడిని, బలాన్ని అందించడంలో మినుములు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ‘కనుమ రోజు మినుము తినాలి’ అనే సామెత పుట్టింది. ఆ రోజు అల్లుళ్లు, బంధువులతో కలిసి మినుములతో చేసిన వంటకాలు తింటూ, విశ్రాంతిగా గడపడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు రహస్యం.
News January 16, 2026
పౌడర్ రాయడం వల్ల ఈ నష్టాలు

బిడ్డకు చెమటలు పడుతున్నప్పుడు పదే పదే పౌడర్ రాస్తే అది తేమను గ్రహించి చర్మాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. పౌడర్ వేయడం వల్ల పిల్లల్లో అలెర్జీలు, ఉబ్బసం, దగ్గు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శిశువు చర్మాన్ని పొడిగా, సౌకర్యవంతంగా ఉంచాలనుకుంటే చర్మంపై కొబ్బరి నూనె వాడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల కోసం పౌడర్‌ను కొనేముందు వైద్యులు సూచించిన ఉత్పత్తులను కొనుగోలు చేయడం మంచిది.


