News April 11, 2025
నిఖితను చంపింది తల్లే.. వీడిన మిస్టరీ

AP: తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన బాలిక <<16045416>>నిఖిత(17)<<>> అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి సుజాత ఆమెను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. అనంతరం గంటల వ్యవధిలోనే నిఖితకు అంత్యక్రియలు జరిపారు. వేరే కులానికి చెందిన అజయ్ అనే యువకుడిని నిఖిత ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇది తెలిసి పేరెంట్స్ ఆమెను మందలించి, అబార్షన్ చేయించారు.
Similar News
News April 20, 2025
YELLOW ALERT: ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎండలతో పాటు అకాల వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD వెల్లడించింది. APలో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు, ఉ.గో, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. TGలో ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, HYD, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News April 20, 2025
GOVT ఉద్యోగాల్లో వారికి 3% రిజర్వేషన్లు

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్‌ను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో పతకాలు సాధిస్తే పోటీ పరీక్షలు లేకుండానే ఉద్యోగం ఇవ్వనుంది. అన్ని ప్రభుత్వ విభాగాలు, DSC, యూనిఫాం శాఖలకూ ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. గతంలో ఉన్న పదేళ్ల కాలపరిమితిని ఎత్తేసింది. అర్హత, వయసు ఉంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పతకాలు సాధించిన వారంతా అర్హులే.
News April 20, 2025
వచ్చే సంక్రాంతికి అఖండ-2?

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు సమాచారం. తొలుత ఈ ఏడాది సెప్టెంబర్ 25కి ప్లాన్ చేయగా ఆలోపు సినిమా షూటింగ్, VFX వర్క్స్ పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ యోచిస్తున్నట్లు టాక్. కాగా బాలయ్య- బోయపాటి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలను సినీ వర్గాలు <<16051406>>ఖండించిన<<>> విషయం తెలిసిందే.