News March 17, 2024

నిర్మల్: హోటల్లు, మిల్క్ సెంటర్ యజమానులకు జరిమానా

image

నిర్మల్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టణంలో శనివారం తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని హోటల్లు, మిల్క్ సెంటర్ యజమానులకు జరిమానా విధించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వాసు రామ్ తెలిపారు. మూడు హోటల్లు, మూడు మిల్క్ సెంటర్లకు రూ. 92000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వ్యాపారస్తులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ఆహారాన్ని కల్తీ చేయవద్దని సూచించారు.

Similar News

News March 7, 2026

సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి: ADB ఎస్పీ

image

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఏఐ మార్ఫింగ్, యూపీఐ, లోన్, ఉద్యోగాల పేరుతో సాగే మోసాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, బాధితులు వెంటనే స్పందిస్తేనే నగదు రికవరీకి అవకాశం ఉంటుందన్నారు.

News March 7, 2026

సైబర్ సైబర్ నేరగాళ్ల అరెస్ట్: ADB CI

image

ఆదిలాబాద్ స్థానిక కెనరా బ్యాంక్ కరెంట్ ఖాతా ద్వారా సైబర్ మోసాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌సీఆర్‌పీ డేటా విశ్లేషణలో ఈ ఖాతాకు దేశవ్యాప్తంగా 146 ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు CI నాగరాజు వెల్లడించారు. నిందితులు రాజవర్ధన్, శ్రీ అక్షయ్, రాజేందర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

News March 6, 2026

9న ఆదిలాబాద్ ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 9న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కావున జిల్లాలోని ITI ఉత్తీర్ణులైన విద్యార్థులు https://www.apprenticeshipindia.gov.in/mela Registration ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు. శిక్షణ కాలంలో స్టైఫండ్ అందజేస్తామని తెలిపారు.