News March 17, 2024
నిర్మల్: హోటల్లు, మిల్క్ సెంటర్ యజమానులకు జరిమానా
నిర్మల్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టణంలో శనివారం తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని హోటల్లు, మిల్క్ సెంటర్ యజమానులకు జరిమానా విధించినట్లు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వాసు రామ్ తెలిపారు. మూడు హోటల్లు, మూడు మిల్క్ సెంటర్లకు రూ. 92000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వ్యాపారస్తులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, ఆహారాన్ని కల్తీ చేయవద్దని సూచించారు.
Similar News
News October 14, 2024
ఆదిలాబాద్ MP నేటి పర్యటన ఇలా..
ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ నేడు (సోమవారం) సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివరాలు ఇలా.. కాగజ్‌నగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న అలాయ్- బలాయ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు దహెగాం ప్రెస్‌క్లబ్ మొదటి వార్షికోత్సవానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బెజ్జూర్ మండల కేంద్రంలో, 4 గంటలకు ఈస్గాంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
News October 13, 2024
బాసర అమ్మవారికి దిల్ రాజు పూజలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు <<14345490>>తనికెళ్ల భరణి<<>> కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించారు. అమ్మవారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం బాసర వేదభారతి పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీ అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.
News October 13, 2024
కడెం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద నీరు
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేనందున కడెం ప్రాజెక్టు వరద తగ్గింది. ప్రాజెక్టులోకి 461 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుందని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 499.350 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ కెనాళ్లకు 669, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.