News July 22, 2024

పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మల

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే(2023-24)ను ప్రవేశపెట్టారు. కాగా రేపు ఆమె సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇదే తొలి బడ్జెట్.

Similar News

News January 26, 2026

దూడలలో తెల్లపారుడు వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?

image

తెల్లపారుడు వ్యాధిని కలిగించే ఇ.కోలి క్రిమి సహజంగా దూడ పేగులలో ఉంటుంది. దూడలు అపరిశుభ్రమైన పొదుగు లేదా పాత్రలలో పాలు తాగినప్పుడు, ఒక్కసారిగా ఎక్కువగా పాలు తాగినప్పుడు, వెన్న ఎక్కువగా ఉన్న చివరి పాలు తాగినప్పుడు, పాలు తాగే సమయాలలో తేడా ఉన్నప్పుడు, జున్నుపాలు సరిగా తాగనప్పుడు, దూడల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు.. దూడ పేగుల్లోని హానికర ఇ.కోలి సంఖ్య పెరిగి తెల్లపారుడు వ్యాధి కలుగుతుంది.

News January 26, 2026

NTPCలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>NTPC<<>>లో 25 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. CA/CMA అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 29 ఏళ్లు. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ అప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే రూ.40వేలు. దరఖాస్తు ఫీజు రూ.500, SC/ST/PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in

News January 26, 2026

పుట్టింట్లో ఒడిబియ్యం ఎందుకు పోస్తారు?

image

పెళ్లి తర్వాత తనవారికి దూరమై కొత్త జీవితం ప్రారంభించే వధువుకు ఆ దూరం వల్ల కలిగే బాధ వర్ణనాతీతం. ఆ తల్లిదండ్రుల, కుమార్తె మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ‘ఒడిబియ్యం’ సంప్రదాయం. ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉండాలని, కూతురుని మళ్లీ మళ్లీ ఇంటికి పిలిపించి చూసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. మనసారా ఆశీర్వదించి ఆమెకు ఇష్టమైన దుస్తులు, పసుపు-కుంకుమ ఇచ్చి గౌరవించడమే ఈ ఆచారం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.