News July 22, 2024
పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మల
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే(2023-24)ను ప్రవేశపెట్టారు. కాగా రేపు ఆమె సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇదే తొలి బడ్జెట్.
Similar News
News October 11, 2024
గోపీచంద్ ‘విశ్వం’ REVIEW
మంత్రి హత్యను చూసిన ఓ పాప ప్రాణాలను రక్షించేందుకు గోపీరెడ్డి అలియాస్ విశ్వం రంగంలోకి దిగుతాడు. అసలు ఈ విశ్వం ఎవరు, ఎందుకు పాపను రక్షిస్తున్నాడు అన్నది బ్యాలెన్స్ కథ. గోపీచంద్ తన పాత్రను అలవోకగా పోషించారు. నరేశ్, ప్రగతి, పృథ్వీరాజ్, వెన్నెల కిషోర్ కామెడీ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో కథను హడావుడిగా చుట్టేయడమే మైనస్. శ్రీను వైట్ల గత 3 సినిమాలతో పోలిస్తే ‘విశ్వం’ బాగుందని చెప్పొచ్చు.
రేటింగ్: 2.25/5
News October 11, 2024
వరదల్లో జగన్ అడుగు బయటపెట్టలేదు: లోకేశ్
AP: చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో పేరుందని వారు భయపడుతున్నారన్నారు. వరదలొచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టలేదని, ఇప్పుడు వరద సాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 11, 2024
నితీశ్‌కుమార్ రెడ్డికి గంభీర్ గోల్డెన్ అడ్వైస్
కోచ్ గౌతమ్ గంభీర్ సలహా తన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని టీమ్ఇండియా యంగ్ సెన్సేషన్ నితీశ్‌కుమార్ రెడ్డి (NKR) అన్నారు. బంగ్లాతో రెండో టీ20లో మెరుగైన ప్రదర్శనకు అదే కారణమని చెప్పారు. ‘నిజం చెప్పాలంటే నేను గౌతమ్ సర్‌కు థాంక్స్ చెప్పాలి. బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌలర్‌లా ఆలోచించాలని, బౌలింగ్ చేయగలిగే బ్యాటర్‌గా కాదని ప్రతిసారీ చెప్తుంటారు’ అని అన్నారు. మ్యాచులో NKR 74 (34balls), 2 వికెట్లు సాధించారు.