News June 13, 2024

చరిత్ర సృష్టించనున్న నిర్మలమ్మ

image

మోదీ 3.0 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు ముంగిట ఉన్నారు. వరుసగా 7సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిలుస్తారు. తద్వారా మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును ఆమె తిరగరాస్తారు. వీరిద్దరూ 5పూర్తి స్థాయి, 1 మధ్యంతర బడ్జెట్ చొప్పున ప్రవేశపెట్టారు. కాగా ఈనెల 24నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. జులైలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

Similar News

News July 1, 2024

జూన్‌లో తగ్గిన యూపీఐ చెల్లింపులు!

image

మే నెలలో రికార్డ్ స్థాయిలో నమోదైన UPI చెల్లింపుల జోరు జూన్‌లో నెమ్మదించింది. లావాదేవీల్లో 1శాతం, వాల్యూలో 2శాతం తగ్గింపు నమోదైంది. మేలో 14.04 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరగగా జూన్‌లో ఆ మొత్తం 13.89 బిలియన్లుగా రికార్డ్ అయింది. లావాదేవీల విలువ ₹20.45 లక్షల కోట్ల నుంచి ₹20.07 లక్షల కోట్లకు తగ్గింది. మరోవైపు మే నెలతో పోలిస్తే IMPS లావాదేవీలు 5%, ఫాస్టాగ్ లావాదేవీలు 4% తగ్గాయి.

News July 1, 2024

ఇకపై 420 కాదు 318!

image

చీటింగ్ కేసుకు పాత చట్టంలో ఉన్న సెక్షన్ 420ని కేంద్రం భారతీయ న్యాయ సంహితలో తొలగించింది. ఇకపై ఆ నేరం సెక్షన్ 318 పరిధిలోకి వస్తుంది. దేశద్రోహాన్ని సెక్షన్ 124A నుంచి 152కి, పరువునష్టాన్ని సెక్షన్ 499 నుంచి 356కి, అత్యాచార నేరాన్ని సెక్షన్ 375 నుంచి 63కి, సెక్షన్ 376Dని తొలగించి గ్యాంగ్ రేప్‌ నేరాన్ని సెక్షన్ 70(1) పరిధిలోకి తీసుకొచ్చింది. సెక్షన్ 302ను (హత్యా నేరం) SEC 103 పరిధిలోకి తెచ్చింది.

News July 1, 2024

కేబినెట్‌లోకి రాజగోపాల్, దానం: దామోదర

image

TG: త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందని, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు కూడా ఉండొచ్చని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్నారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌, నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్‌లో చోటు ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు TPCC చీఫ్ ఎంపికపైనా కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అతిత్వరలో చీఫ్‌ను ప్రకటించే అవకాశం ఉంది.