News February 9, 2025
తండ్రికి నితీశ్ కుమార్ రెడ్డి గిఫ్ట్

భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తన తండ్రికి ప్రత్యేకంగా బంగారు బ్రాస్‌లెట్ తయారు చేయించి కానుకగా ఇచ్చారు. ఆ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. తనకోసం తండ్రి కెరీర్‌ను వదిలేసుకుని జీవితాన్ని త్యాగం చేశారని నితీశ్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియాకు ఆడుతూ తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నితీశ్ ఈ బహుమతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.
Similar News
News March 26, 2025
ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. ఇప్పటికే కొన్ని పేపర్ల వాల్యుయేషన్ ప్రారంభమైంది. అన్ని పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత ఏప్రిల్ 4వ వారంలో ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెల 29న ఎప్‌సెట్ ఉండటంతో దానికి 2, 3 రోజులు ముందుగానే రిజల్ట్స్ రిలీజ్ చేయాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది ఇంటర్ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే.
News March 26, 2025
ఓట్ల కోసమే విభజన రాజకీయం: యోగి

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో కొంతమంది దేశంలో విభజనలను సృష్టిస్తున్నారని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఇతరులను కించపరచడం సరికాదని చట్టం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓట్ల కోసమే ప్రాంతం, భాష పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు తెస్తున్నారని, యూపీలో తెలుగు, తమిళ భాషలు నేర్చుకుంటున్నప్పుడు తమిళనాడులో హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని యోగి ప్రశ్నించారు.
News March 26, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

గత 5 రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.100 పెరిగి రూ.81,950లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 పెరగడంతో రూ.89,400 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర రూ.1000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,11,000గా ఉంది.