News December 6, 2024
మళ్లీ ఆదుకున్న నితీశ్ రెడ్డి

పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆదుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, అడిలైడ్ టెస్టులోనూ ఆపద్బాంధవుడయ్యారు. 3 సిక్సులు, 3 ఫోర్లతో 54 బంతుల్లో 42 రన్స్ చేసి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చారు. పింక్ బాల్ స్వింగ్ అవుతుండటంతో మేటి బ్యాటర్లు చేతులెత్తేసినా నితీశ్ టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. భారత్‌కు సరైన ఆల్‌రౌండర్ దొరికాడంటూ నెట్టింట నితీశ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News October 18, 2025
క్రికెటర్లకు అఫ్గాన్ క్రికెట్ బోర్డ్ నివాళి

పాక్ వైమానిక దాడుల్లో మరణించిన ముగ్గురు డొమెస్టిక్ క్రికెటర్లకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు నివాళులర్పించింది. ‘పాక్ పిరికిపంద చర్యకు ఉర్గున్ జిల్లాకు చెందిన ముగ్గురు క్రికెటర్లను కోల్పోయాం. కబీర్, సిబ్గతుల్లా, హరూన్ మృతి మన స్పోర్ట్స్ కమ్యూనిటీకి తీరని లోటు. వీరి మృతికి గౌరవార్థం పాక్, శ్రీలంకతో జరగబోయే ట్రై సిరీస్ నుంచి తప్పుకుంటున్నాం. ఈ దాడిలో ఐదుగురు పౌరులు కూడా చనిపోయారు’ అని తెలిపింది.
News October 18, 2025
బనకచర్లపై స్టేటస్ తెలపాలని గోదావరి బోర్డు లేఖ

AP: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ వాస్తవ స్థితి తెలియజేయాలని గోదావరి బోర్డు రాష్ట్ర జలవనరుల శాఖకు లేఖ రాసింది. లింక్ ప్రాజెక్టుల ప్రతిపాదనలపై తెలంగాణ ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు వివరణ ఇవ్వాలని కోరింది. ఇటీవల బనకచర్ల డీపీఆర్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటీస్ ఇచ్చింది. దీనిపై TG జలవనరుల శాఖ అభ్యంతరం తెలుపుతూ బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
News October 18, 2025
7,565 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

ఇంటర్ అర్హతతో 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 21 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-25 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. <