News December 6, 2024
మళ్లీ ఆదుకున్న నితీశ్ రెడ్డి

పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆదుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డి, అడిలైడ్ టెస్టులోనూ ఆపద్బాంధవుడయ్యారు. 3 సిక్సులు, 3 ఫోర్లతో 54 బంతుల్లో 42 రన్స్ చేసి జట్టు స్కోరును 180 పరుగులకు చేర్చారు. పింక్ బాల్ స్వింగ్ అవుతుండటంతో మేటి బ్యాటర్లు చేతులెత్తేసినా నితీశ్ టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. భారత్‌కు సరైన ఆల్‌రౌండర్ దొరికాడంటూ నెట్టింట నితీశ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News February 9, 2026
పాపం.. ఇషాన్ కిషన్!

దేశవాళీ ప్రదర్శనతో T20 WC జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్‌పై BCCI దయ చూపలేదు. తాజాగా రిలీజ్ చేసిన <<19095739>>సెంట్రల్ కాంట్రాక్ట్<<>> లిస్టులో అతనికి చోటు కల్పించలేదు. దీంతో కిషన్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. రంజీల్లో ఆడకుండా రెస్ట్ తీసుకోవడం, దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేశారని 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇతనితో పాటు శ్రేయస్‌ను BCCI తొలగించింది. అయితే తాజా లిస్టులో అయ్యర్ గ్రేడ్-Bలో ఉన్నారు.
News February 9, 2026
ఫలితాలకు ముందే సీఎం ఓటమిని ఒప్పుకున్నారు: బండి

TG: సీఎం <<19093271>>రేవంత్<<>> మున్సిపల్ ఫలితాలకు ముందే ఓటమిని ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ భయంతోనే బీజేపీపై అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. సీఎం స్క్రిప్ట్ దారుస్సలాంలో ప్రిపేర్ అవుతోందని విమర్శించారు. చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టడం సీఎంకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము తనకు లేదని రేవంత్ లేఖ రాస్తే వాళ్ల సంగతి తాము చూసుకుంటామన్నారు.
News February 9, 2026
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ‘ఈ-ప్యాంట్రీ’ సేవలు ప్రారంభం

రైల్వే ప్రయాణికులకు IRCTC శుభవార్త చెప్పింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారికి E-ప్యాంట్రీ సేవలను ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో లేదా ఆ తరువాత ఆన్‌లైన్‌లో ఫుడ్, వాటర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. జర్నీ రోజున సీటు వద్దకే భోజనం అందిస్తారు. ప్రస్తుతం 25 రైళ్లలో ఇది అమల్లోకి వచ్చింది. E-ప్యాంట్రీ సేవను తొలుత వివేక్ ఎక్స్‌ప్రెస్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు.


