News August 29, 2024

త్వరలో వేములవాడలో నిత్యాన్నదానం: పొన్నం

image

TG: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. తిరుమలలోని వెంగమాంబ నిత్యాన్నదాన కార్యక్రమం మాదిరి ఇక్కడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు భక్తులు, దాతలు సహకరించాలని కోరారు. రానున్న కార్తీకమాసంలోగా అన్నదానం ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆలయాన్ని విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

Similar News

News September 8, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది.

News September 8, 2024

మున్నేరుకు వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

image

TG: మహబూబాబాద్, ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఖమ్మం సిటీలో పరీవాహక ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రభావిత కాలనీల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

News September 8, 2024

నా X అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు: బ్రహ్మాజీ

image

వైసీపీ చీఫ్ జగన్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన <<14049130>>ట్వీట్<<>> వైరలవ్వడంపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. తన X అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని, దీనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.