News April 5, 2026

NLG: అగ్నిమాపక కేంద్రాల ఫోన్ నంబర్లు ఇవే!

image

వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇస్తే ఆస్తి నష్టాన్ని అరికట్టవచ్చు. జిల్లా వాసుల కోసం ఫైర్ స్టేషన్ల ఫోన్ నంబర్లు: నల్గొండ- 87126 99318, మిర్యాలగూడ- 87126 99320, నకిరేకల్- 87126 99324, హాలియా- 87126 99276, దేవరకొండ- 87126 99322. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ నంబర్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News April 20, 2026

NLG: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

image

వంగమర్తి గ్రామ కార్యదర్శి దేవేందర్ తనను వేధిస్తున్నాడని బాధితుడు భూత్కూరు వెంకటరెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సంబంధించిన యాజమాన్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, కార్యదర్శి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్న కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

image

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.