News March 17, 2024
NLG: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో పూర్తి కానున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. జంబ్లింగ్ విధానంలో హాల్ టికెట్ నంబర్లను కూడా వేశారు. రోజూ ఉదయం 9.30 గం టల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. శనివారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ భిక్షపతి పరిశీలించారు.
Similar News
News October 31, 2024
రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోే డబ్బులు జమ చేయాలి: కలెక్టర్
ధాన్యం అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాలలో రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం నల్గొండ సమీపంలోని ఆర్జాల బావి, ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ల వద్ద ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తున్నదని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News October 31, 2024
ధాన్యం సేకరణలో సంపూర్ణ సహకారం అందించాలి: కలెక్టర్
ధాన్యం కొనుగోలు, కష్టం మిల్లింగ్ రైస్ విషయంలో జిల్లా రైస్ మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం ఆమె కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో 2024- 25 ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు కష్టం మిల్లింగ్ రైస్ కేటాయింపు, అదనపు మిల్లింగ్ ఛార్జీలపై సమావేశం నిర్వహించారు. ఈ వానాకాలం ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కోరారు.
News October 30, 2024
ఎంబీఏ జనరల్ 4వ సెమిస్టర్ 95 శాతం ఉత్తీర్ణత
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎంబీఏ జనరల్, ఎంబీఏ టీటీఎం 1, రెండు, మూడు, నాలుగు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఎంబీఏ జనరల్ 4వ సెమిస్టర్ 200 మంది విద్యార్థులకుగాను 191 (95%) మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంజీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.