News March 17, 2024

NLG: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు

image

పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో పూర్తి కానున్నాయి. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. జంబ్లింగ్ విధానంలో హాల్ టికెట్ నంబర్లను కూడా వేశారు. రోజూ ఉదయం 9.30 గం టల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. శనివారం జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ భిక్షపతి పరిశీలించారు.

Similar News

News April 24, 2025

కాంగ్రెస్‌ నేతల్లో గగుర్పాటు: జగదీశ్ రెడ్డి

image

బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ కాంగ్రెస్‌ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘ఇది బీఆర్‌ఎస్‌ సభనా, లేక టీఆర్‌ఎస్‌ సభనా అంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్‌ వస్తుండే. ఆల్‌రెడీ బీఆర్‌ఎస్‌ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు’ అని పేర్కొన్నారు.

News April 24, 2025

NLG: ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిపేందుకు చర్యలు

image

అందరూ సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరిగేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ మండలం గుట్టకింది అన్నారంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లర్లతో ఫోన్‌లో మాట్లాడి కొనుగోలు వేగవంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. రైతులు కూడా కేంద్రం సిబ్బందికి సహకరించాలని సూచించారు.

News April 23, 2025

HYD – WGL హైవేపై యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

image

హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. యాదగిరిగుట్ట మండలం బాహుపేట స్టేజీ వద్ద కారు ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆలేరుకు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!