News March 18, 2024

NLR: పోలంరెడ్డికి MLC హామీ?

image

కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇన్‌ఛార్జ్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డిని కాదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చంద్రబాబు ఖరారు చేశారు. అలకబూనిన పోలంరెడ్డి కచ్చితంగా కోవూరు నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో టీడీపీ పెద్దలు స్పందించి పోలంరెడ్డిని నిన్న విజయవాడలో చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఛైర్మన్, పార్టీ పదవి, 2027లో MLC హామీ ఇస్తానని పోలంరెడ్డికి హమీ ఇచ్చినట్లు సమాచారం.

Similar News

News February 20, 2026

నెల్లూరు- బద్వేల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు వేగంగా అడుగులు..!

image

రాయలసీమ, నెల్లూరు జిల్లాల పారిశ్రామికీకరణలో కీలకమైన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో అడుగులు వేగంగా పడుతున్నాయి. మనుబోలు మండలంలోని కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి కడప జిల్లా బద్వేల్ వరకూ నిర్మించ తలపెట్టిన భారీ ప్రాజెక్ట్‌కు తాజాగా కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మనుబోలు, పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది.

News February 20, 2026

నెల్లూరు: ఉపవాస వేళల్లో మార్పులు

image

నెల్లూరు జిల్లాలో గురువారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఉపవాస దీక్షల్లో శుక్రవారం నుంచి మూడు రోజులు సహారి, ఇఫ్తార్ వేళలు మారనున్నాయి. శుక్ర, శని, ఆదివారాలలో సహరి ఉదయం 5:16 లోపు ముగించాలి. సాయంత్రం ఇఫ్తార్ 6:17 ఉపవాస దీక్షను విరిమించే సమయంగా ఉంది. మార్పులను ముస్లిం సోదరులు తప్పనిసరిగా పాటించాలని మత పెద్దలు చెబుతున్నారు.