News March 18, 2024
NLR: పోలంరెడ్డికి MLC హామీ?
కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇన్‌ఛార్జ్ పోలంరెడ్డి దినేశ్ రెడ్డిని కాదని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి చంద్రబాబు ఖరారు చేశారు. అలకబూనిన పోలంరెడ్డి కచ్చితంగా కోవూరు నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. దీంతో టీడీపీ పెద్దలు స్పందించి పోలంరెడ్డిని నిన్న విజయవాడలో చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ ఛైర్మన్, పార్టీ పదవి, 2027లో MLC హామీ ఇస్తానని పోలంరెడ్డికి హమీ ఇచ్చినట్లు సమాచారం.
Similar News
News October 16, 2024
నాయుడుపేటలో రెండు కంపెనీ బస్సుల ఢీ
నాయుడుపేట పట్టణంలోని కరెంట్ ఆఫీస్ దగ్గర బుధవారం ఉదయం మేనకూరు పారిశ్రామికవాడకు చెందిన 2 కంపెనీ బస్సులు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. కరెంట్ ఆఫీస్ దగ్గర మలుపు తిరుగుతున్న ఓ కంపెనీ బస్సును వెనక నుంచి వచ్చి ఓ కంపెనీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో రెండు బస్సులకు అద్దాలు పడిపోయాయి. కార్మికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపించుకున్నారు.
News October 16, 2024
వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కూర్మనాథ్
బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన తుఫాను గంటకు 10 కి.మీ వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం చెన్నైకి 440, పుదుచ్చేరికి 460, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం రేపు తెల్లవారుజామున పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎండి రోణంకి కుర్మానాథ్ తెలిపారు.
News October 16, 2024
RED ALERT.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈనెల 17వ తేదీ పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. నెల్లూరు జిల్లాకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది.