News April 1, 2024
ఎన్నికలు పూర్తయ్యే వరకు కాంగ్రెస్‌పై చర్యలు తీసుకోము: ఐటీ శాఖ

కాంగ్రెస్‌కు రూ.1700కోట్ల పన్ను నోటీసు జారీ చేయడంపై సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ వివరణ ఇచ్చింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సొమ్ము రికవరీపై తాము ఎలాంటి చర్యలు చేపట్టమని స్పష్టం చేసింది. ఎన్నికల వేళ తాము ఏ పార్టీకి ఆటంకాలు కలిగించాలని అనుకోవట్లేదని తెలిపింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేయాలని కోర్టుకు ఐటీ శాఖ విజ్ఞప్తి చేసింది.
Similar News
News March 30, 2026
మహాలక్ష్మి పథకంతో మహిళలకు ₹10వేల కోట్లు ఆదా: TGSRTC

TG: మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలకు ఆదా అయిన ఛార్జీల మొత్తం ₹10వేల కోట్లకు చేరినట్లు TGSRTC ప్రకటించింది. దాదాపు 290కోట్లకుపైన జీరో టికెట్‌ను మహిళలు వినియోగించుకున్నట్లు తెలిపింది. ఈ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య 40% నుంచి 67%కు పెరిగిందని వెల్లడించింది. ఒకప్పుడు రవాణా ఛార్జీలపై మహిళలు సగటున ₹1500-2500 వెచ్చించేవారని.. కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని పేర్కొంది.
News March 30, 2026
నేడు RR vs CSK

ఐపీఎల్‌లో ఈరోజు మూడో మ్యాచ్ జరగనుంది. అస్సాంలోని బర్సపారా స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రాజస్థాన్‌కు గత ఏడాది మొదటి మూడు మ్యాచ్‌లు కెప్టెన్సీ చేపట్టిన పరాగ్ ఈసారి ఆ జట్టుకు పూర్తిగా సారథ్యం వహిస్తారు. మరోవైపు CSKకు రుతురాజ్ సారథ్యం కొనసాగిస్తారు. ఇప్పటివరకు ఈ జట్లు 31సార్లు తలపడగా CSK 16, RR 15సార్లు గెలిచింది. ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.
News March 30, 2026
నేటి నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమలలో ఈరోజు నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. వసంతమండపంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ మూడురోజులూ స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. రేపు ఉ.8-10 మధ్య స్వర్ణరథంపై శ్రీవారి తిరువీధిని చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ మూడు రోజులూ కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు రేపటి అష్టదళ పాద పద్మారాధన సేవను TTD రద్దు చేసింది.


