News January 10, 2025

TTD ఛైర్మన్, ఈఓ, జేఈఓపై చర్యలేవీ: అంబటి

image

AP: తిరుపతి తొక్కిసలాటకు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓ కారణమని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. వీరిపై సీఎం చంద్రబాబు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘అసలు బాధ్యులను వదిలేసి వేరేవారిపై తూతూమంత్రపు చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ, గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్ చేయడం ఏంటీ? అసలైన బాధ్యులు టీటీడీ ఛైర్మన్, ఈఓ, జేఈఓపై చర్యలు తీసుకోకపోతే చంద్రబాబుకు పాపం తగులుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News January 13, 2025

జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

image

AP: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ బరులు సిద్ధం చేసి నిర్వాహకులు పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పందేల్లో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలైన TG, TN, కర్ణాటక నుంచి కూడా చాలామంది ఆసక్తితో కోడిపందేల కోసమే గోదావరి జిల్లాలకు రావడం విశేషం.

News January 13, 2025

చైనాలో hMPV కేసులు త‌గ్గుతున్నాయ్

image

చైనాలో hMPV కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. వైర‌స్ వ్యాప్తిపై ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చెల‌రేగిన విషయం తెలిసిందే. అయితే ఇది చాలా ద‌శాబ్దాలుగా ఉంద‌ని, ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య త‌గ్గింద‌ని చైనా వైద్యాధికారులు తెలిపారు. పిల్లల్లో వైర‌స్ వ్యాప్తి త‌గ్గింద‌ని వివ‌రించారు. భార‌త్‌లో 17 hMPV కేసులు న‌మోదయ్యాయి. వైర‌స్ వ్యాప్తిపై ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని కేంద్రం ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

News January 13, 2025

లాస్ ఏంజెలిస్ కార్చిచ్చు.. హాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు

image

లాస్ ఏంజెలిస్‌లో చెల‌రేగిన కార్చిచ్చును అదుపుచేసే క్రమంలో ఏర్పడిన నీటి కొర‌తకు హాలీవుడ్ న‌టులే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. విస్తార‌మైన వారి ఇంటి గార్డెన్ల నిర్వ‌హ‌ణ‌కు మోతాదుకు మించి నీటిని వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. గ‌తంలో ప‌రిమితికి మించి నీటిని వినియోగించార‌ని కిమ్ క‌ర్దాషియ‌న్‌కు ఫైన్ విధించారు. సిల్వ‌స్టెర్ స్టాలోన్‌, కెవిన్ హార్ట్ వంటి ప్ర‌ముఖులూ ఫైన్ చెల్లించిన వారిలో ఉన్నారు.