News March 21, 2024
సుప్రీంకోర్టు ముందు ఏ కేసూ చిన్నది కాదు: CJI

భారత ప్రజలకు సుప్రీంకోర్టు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు CJI జస్టిస్ చంద్రచూడ్. కులం, మతం, లింగం, హోదాలకు అతీతంగా న్యాయం చేస్తామన్నారు. సుప్రీంకోర్టు ముందు ఏ కేసూ చిన్నది కాదని స్పష్టం చేశారు. సామాన్యులు న్యాయం కోసం మొదట జిల్లా కోర్టును ఆశ్రయిస్తారని అందుకే వాటిని సమర్థంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల 150 మంది జిల్లా కోర్టు జడ్జిలతో సమావేశమైనట్లు తెలిపారు.
Similar News
News April 24, 2025
SRH ఇక ఇంటికే..?

ఈ ఏడాది IPLలో SRH ప్లే ఆఫ్స్ ఆశలు ఇక ముగిసినట్లేనని క్రికెట్ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 8 మ్యాచులాడి రెండే గెలవడం, రన్‌రేట్ మరీ ఘోరంగా ఉండటం, ఇప్పటికే 2 జట్లు 12 పాయింట్లు, 4 జట్లు 10 పాయింట్లు సాధించడంతో మిగిలిన అన్ని మ్యాచులూ గెలిచినా SRH ప్లే ఆఫ్స్ చేరడం కష్టమేనంటున్నారు. నిన్న రాత్రి ముంబై మీద సన్‌రైజర్స్ ఘోరంగా ఓడిన సంగతి తెలిసిందే. అన్ని విభాగాల్లోనూ రైజర్స్ విఫలమవుతున్నారు.
News April 24, 2025
ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య మరోసారి వాగ్వాదం

ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా పరిగణించి, నాటోలో ఎప్పటికీ చేరనని హామీ ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షున్ని ట్రంప్ కోరారు. దీనికి జెలెన్‌స్కీ ఒప్పుకోకపోవడంతో US అధ్యక్షుడిగా ఒబామా ఉన్న కాలంలోనే క్రిమియా రష్యాలో కలిసిందని ఆ విషయంపై ప్రశ్నే తలెత్తదని ట్రంప్ మండిపడ్డారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విరమణపై ఇద్దరు నేతలు లండన్‌లో చర్చలు జరిపారు.
News April 24, 2025
ట్రంప్‌పై కోర్టుకెక్కిన 12 రాష్ట్రాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై ఆ దేశానికి చెందిన 12 రాష్ట్రాల ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించాయి. ‘1977లో చేసిన చట్టం ప్రకారం టారిఫ్‌ను విధించేందుకు అత్యవసర చర్యలు తీసుకునే అధికారం అధ్యక్షుడికి లేదు. చట్టసభకు మాత్రమే ఆ అధికారముంది. ఇష్టారాజ్యంగా టారిఫ్‌లు విధించి అధ్యక్షుడు రాజ్యాంగాన్ని మీరారు. దేశ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలో పడేశారు’ అని తమ దావాలో ప్రభుత్వాలు ఆరోపించాయి.