News March 30, 2024
వడ్డీ రేట్లలో నో ఛేంజ్?

వడ్డీ రేట్లలో ఆర్బీఐ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని గోల్డ్మ్యాన్ సాచ్స్ సంస్థ వెల్లడించింది. ఏప్రిల్ 5న జరిగే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపోరేటును యథాతథంగా (6.5%) కొనసాగించాలని RBI నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆహార ఉత్పత్తుల ధరల పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో RBI అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 5.1% నమోదు కాగా ఈనెల అది 5.2%కు పెరగొచ్చని అంచనా వేసింది.
Similar News
News January 19, 2026
ఇండియన్ క్రికెట్లో ఏం తప్పు జరుగుతోంది: CV ఆనంద్

న్యూజిలాండ్ చేతిలో భారత్ చారిత్రక ఓటమిని ఎదుర్కోవడంపై IPS CV సివి ఆనంద్ చేసిన ఘాటు వ్యాఖ్యలు SMలో వైరల్గా మారాయి. ‘ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు, అపారమైన ప్రతిభ, ఏడాదంతా టోర్నీలు ఉన్నప్పటికీ.. మనం వరుసగా అన్నీ ఓడిపోతున్నాం. అసలు ఇండియన్ క్రికెట్లో తప్పెక్కడ జరుగుతోంది? IPL డబ్బు ప్రభావం, ఆటగాళ్లలో టెంపర్మెంట్ తగ్గడం, పూర్ సెలక్షన్, కోచ్ గంభీరే దీనికి కారణమా?’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు.
News January 19, 2026
ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

TG: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం అందించిన రిజర్వేషన్ల సమాచారాన్ని SEC వెబ్సైట్లో పొందుపరిచింది. నిన్న మేడారంలో జరిగిన క్యాబినెట్ భేటీలో మున్సి‘పోల్స్’కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. FEB 14 నుంచి ఈ ఎన్నికలు జరగవచ్చన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇపుడు SEC రిజర్వేషన్లను ప్రకటించడంతో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చని స్పష్టమవుతోంది.
News January 19, 2026
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!

వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీనికి ముందు వరుసగా 3 రోజులు సెలవులున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27న సమ్మె జరగనుంది. దీంతో వరుసగా 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంక్ పనులుంటే ముందే ప్లాన్ చేసుకోవడం బెటర్.


