News November 9, 2024

ఎవరు పడితే వాళ్లు రావడానికి దేశమేమీ ధర్మసత్రం కాదు: కేంద్రమంత్రి

image

ఎవరు పడితే వాళ్లొచ్చి సెటిలవ్వడానికి దేశమేమీ ధర్మసత్రం కాదని కేంద్రమంత్రి శివరాజ్ చౌహాన్ అన్నారు. ‘ఝార్ఖండ్లో చొరబాటు దారుల్ని JMM ప్రభుత్వం కీర్తిస్తోంది. ఓటు బ్యాంకుగా చూస్తోంది. వారు ఆధార్, రేషన్ కార్డులు పొందేలా సాయపడుతోంది. దాంతో సంతాల్ పరగణాలో గిరిజనుల జనాభా 44 నుంచి 28%కి పడిపోయింది. ఈ దేశం మనది. ఈ నేల, నీరు, అడవులు, కొండలు, పొలాలు మనవి. వీటిని మన నుంచి లాగేసుకోనివ్వొద్దు’ అని అన్నారు.

Similar News

News December 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 9, 2024

బిగ్‌బాస్ నుంచి విష్ణు‌ప్రియ ఎలిమినేట్

image

Bigg Boss సీజన్-8 నుంచి విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కాగా, శనివారం రోహిణి హౌస్ నుంచి వెళ్లిన విషయం తెలిసిందే. ఆదివారం డబుల్ ఎలిమినేష‌న్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. చివరకు అతి తక్కువ ఓట్లు వచ్చిన విష్ణుప్రియ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. చివరి దశకు చేరుకున్న ఈ సీజన్‌ టాప్-5లో నబీల్‌, నిఖిల్‌, ప్రేరణ, గౌతమ్‌, అవినాష్‌లు ఉన్నారు.

News December 9, 2024

డిసెంబర్ 9: చరిత్రలో ఈ రోజు

image

1946: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(ఫొటోలో) జననం
1970: టాలీవుడ్ డైరెక్టర్ వి.సముద్ర జననం
1975: హీరోయిన్ ప్రియా గిల్ జననం
1981: హీరోయిన్ కీర్తి చావ్లా జననం
2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం