News December 31, 2024
రైతు భరోసాపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు: మంత్రి

TG: పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పథకానికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. రైతు భరోసా విషయంలో క్యాబినెట్ నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. కాగా జనవరి 4న జరిగే క్యాబినెట్ భేటీలో రైతు భరోసా విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది.
Similar News
News April 6, 2026
కృతి శెట్టి.. ఈసారైనా హిట్టు కొడతావా క్యూటీ!

‘ఉప్పెన’తో తొలి సినిమాకే బ్లాక్‌బస్టర్ కొట్టిన కృతిశెట్టికి సరైన హిట్లు పడటం లేదు. ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ మినహా తర్వాత చేసిన 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తాజాగా ప్రదీప్ రంగనాథన్‌తో ఆమె చేసిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ మూవీ ఈ నెల 10న రిలీజవుతోంది. ఇదైనా హిట్ అవుతుందేమో చూడాలి. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకీ-కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీలో ఆమె హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
News April 6, 2026
ఫలితం నిర్ణయించేది కూటమే.. ఉండవల్లి కామెంట్లపై చర్చ

AP: కూటమి విడిపోతేనే జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన కామెంట్లపై చర్చ జరుగుతోంది. కూటమి కలిసి ఉంటే 15 ఏళ్లు అధికారంలో ఉండే ఛాన్స్ ఉందన్నారు. అయితే కూటమి కలిసే ఉంటుందని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జనసేనాని పవన్ కళ్యాణ్ పలుమార్లు స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ సైతం అదే మాటపై ఉన్నారు. దీనిపై మీ కామెంట్?
News April 6, 2026
ట్రంప్‌ను పదవి నుంచి తొలగిస్తారా?

ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఓ చట్టసభ్యుడు కూడా అందుకు ప్రతిపాదించారని సమాచారం. కాల్షీ వంటి బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆయన తొలగింపుపై పందెం వేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం, కీలక నిర్ణయాల్లో ఆయన వ్యవహారశైలే అందుకు కారణం. ట్రంప్‌ను 25వ అమెండ్‌మెంట్ ఆధారంగా తొలగిస్తారా అనే ప్రశ్నకు ‘Yes’ అన్నవారి సంఖ్య గతనెలలో 28.6% ఉండగా ఇప్పుడది 35.1%కి చేరింది.


