News June 22, 2024

డైలాగులు కాదు.. అసెంబ్లీకి వచ్చి పోరాడు:TDP

image

AP: వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయించారని ఆ పార్టీ చీఫ్ జగన్ చేసిన <<13487894>>ట్వీట్‌<<>>కు TDP కౌంటర్ ఇచ్చింది. ‘ప్రజల తాగునీటి అవసరాలకు ఉపయోగపడే వాటర్ ప్లాంట్ కట్టకుండా మత్స్యకారుల భూమిని ఆక్రమించి, కబ్జా చేసి కట్టామని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. ప్రజల ఆస్తులు కొల్లగొడుతూ నీ ఆక్రమణలు వదిలేయమంటావా? ఇంత పెద్ద డైలాగులు వద్దులే కానీ, ముందు అసెంబ్లీకి వచ్చి పోరాడు’ అని జగన్‌ను ట్యాగ్ చేసింది.

Similar News

News November 10, 2024

సర్వేలో పాల్గొనండి.. పథకాల్లో కోత ఉండదు: మంత్రి పొన్నం

image

TG: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్‌లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని, సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేటర్లకు ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. ఈ సర్వే తర్వాత సంక్షేమ పథకాల్లో కోత ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.

News November 10, 2024

ప్రపంచంలో అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు ఇవే!

image

ప్రతి ఒక్కరూ ఫోన్, ఈమెయిల్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, సోషల్ మీడియా ఖాతాలకు పాస్‌వర్డ్‌లు ఉపయోగిస్తుంటారు. కానీ గుర్తుంచుకోవడం సులభమని కొందరు ఈజీ పాస్‌వర్డ్‌లు క్రియేట్ చేసుకుంటారు. అవి అత్యంత ప్రమాదకరమని ఓ స్టడీ తెలిపింది. 123456, 123456789, 12345, qwerty, password, 12345678, 111111, 123123, 1234567890, 1234567 పాస్ వర్డ్‌లు అత్యంత చెత్తవని వెల్లడించింది. ఇలాంటివి వాడకపోవడం మంచిదని పేర్కొంది.

News November 10, 2024

గ్రూప్-3 హాల్‌టికెట్లు విడుదల

image

TG: ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను TGPSC విడుదల చేసింది. 17న ఉ.10 నుంచి మ.12.30 వరకు పేపర్‌-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్‌-2, 18న ఉ.10 నుంచి మ.12.30వరకు పేపర్‌-3 పరీక్ష ఉంటుంది. అర గంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 1,388 పోస్టులకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.
వెబ్‌సైట్: www.tspsc.gov.in/