News February 19, 2025
ఫడ్నవీస్‌తో ఎలాంటి విభేదాలూ లేవు: ఏక్నాథ్ షిండే

మహారాష్ట్ర ప్రస్తుత CM ఫడ్నవీస్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని డిప్యూటీ CM, ఏక్నాథ్ షిండే తెలిపారు. CMRFకి పోటీగా తాను వైద్యసహాయ కేంద్రాన్ని ప్రారంభించడంపై స్పష్టతనిచ్చారు. ‘అభివృద్ధిని అడ్డుకునేవారిపై కలిసి పోరాటం చేస్తున్నాం తప్ప మా మధ్య ఎలాంటి మనస్పర్థలూ లేవు. నేను CMగా ఉన్నప్పుడు ఫడ్నవీస్ కూడా ఇలాగే కేంద్రాన్ని నిర్వహించారు. ఇది సాయమందించేందుకే గానీ మా మధ్య పోటీ కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
పెంచలకోనలో విశేష పూజలు

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
News December 6, 2025
బిగ్‌బాస్-9: రీతూచౌదరి ఎలిమినేట్?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9 రసవత్తరంగా మారింది. ఈ వారం రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. నామినేషన్లలో ఆరుగురు ఉండగా నలుగురు సేవ్ అయ్యారు. చివరికి సుమన్ శెట్టి, రీతూ చౌదరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే అంతా సుమనే ఎలిమినేట్ అవుతారని భావించగా తక్కువ ఓటింగ్ రావడంతో అనూహ్యంగా రీతూ బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. రేపు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్‌తో క్లారిటీ రానుంది.
News December 6, 2025
మూతపడిన రామగుండం థర్మల్ స్టేషన్

TG: రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ మూతపడింది. 1971 అక్టోబర్‌లో USAID సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్ 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్లాంట్ జీవితకాలం ముగిసిందని మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లో వ్యవసాయ పంపు సెట్లకు ఈ యూనిట్ నుంచే విద్యుత్ సరఫరా చేశారు.


