News February 19, 2025

ఫడ్నవీస్‌తో ఎలాంటి విభేదాలూ లేవు: ఏక్‌నాథ్ షిండే

image

మహారాష్ట్ర ప్రస్తుత CM ఫడ్నవీస్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని డిప్యూటీ CM, ఏక్‌నాథ్ షిండే తెలిపారు. CMRFకి పోటీగా తాను వైద్యసహాయ కేంద్రాన్ని ప్రారంభించడంపై స్పష్టతనిచ్చారు. ‘అభివృద్ధిని అడ్డుకునేవారిపై కలిసి పోరాటం చేస్తున్నాం తప్ప మా మధ్య ఎలాంటి మనస్పర్థలూ లేవు. నేను CMగా ఉన్నప్పుడు ఫడ్నవీస్ కూడా ఇలాగే కేంద్రాన్ని నిర్వహించారు. ఇది సాయమందించేందుకే గానీ మా మధ్య పోటీ కాదు’ అని పేర్కొన్నారు.

Similar News

News March 27, 2025

ఈ వీకెండ్ ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

నేటి నుంచి ఈనెల 30 వరకు పలు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. ఇవాళ మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ థియేటర్లలో సందడి చేయనుంది. రేపు ‘మ్యాడ్ స్క్వేర్‌’తో పాటు నితిన్-శ్రీలీల నటించిన ‘రాబిన్‌హుడ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈనెల 30న సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్'(హిందీ) కూడా విడుదల కానుంది. మరి ఈ వీకెండ్ మీరు ఏ సినిమాకు వెళ్తున్నారు? కామెంట్ చేయండి.

News March 27, 2025

స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు

image

TG: SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 11.88 లక్షల మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 10.34 లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. MBBS, PG మెడికల్ ప్రవేశాలు పూర్తి కాకపోవడం, ఇంకా విద్యార్థుల వివరాలు అందకపోవడంతో గడువును పొడిగించారు. అటు కాలేజీల యాజమాన్యాల రిజిస్ట్రేషన్‌కూ మే 31 వరకు గడువు ఇచ్చారు.

News March 27, 2025

మీ ఫోన్‌పే, గూగుల్‌పే పని చేస్తున్నాయా?

image

నిన్న రాత్రి 7.30 గంటలకు దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్స్ పనిచేయలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గంట తర్వాత సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అయినా కొందరు తమ సమస్య అలాగే ఉందని SMలో పోస్టులు పెట్టారు. మరి మీ యూపీఐ పేమెంట్స్ పనిచేస్తున్నాయా? కామెంట్ చేయండి.

error: Content is protected !!