News September 12, 2024
నమాజ్ టైమ్‌లో దుర్గాపూజ పనులు వద్దు: బంగ్లా

ముస్లిములు నమాజ్, అజాన్ చేసేటప్పుడు దుర్గా మండపాల వద్ద 5 నిమిషాల ముందే మైకులు, స్పీకర్లు ఆఫ్ చేయాలని బంగ్లాదేశ్ హోమ్ అఫైర్స్ అడ్వైజర్ జహంగీర్ ఆలమ్ అన్నారు. ఇందుకు పూజా కమిటీలు అంగీకరించాయని తెలిపారు. ‘ఈ ఏడాది 32,666 పూజా మండపాలు వెలుస్తాయి. విగ్రహాల తయారీ దశ నుంచే ఎలాంటి కలహాలు చెలరేగకుండా 24 గంటల భద్రతకు చర్యలు తీసుకుంటాం’ అని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులు జరుపుకొనే అతిపెద్ద పండుగ ఇదే.
Similar News
News November 28, 2025
జనగామ: గెలుపు గుర్రాలకే సర్పంచ్ టికెట్!

గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల్లో సీనియర్ నాయకులు సర్పంచ్ టికెట్ కోసం ఆశిస్తున్నారు. కానీ, మండల, జిల్లా నాయకులు, పార్టీ అధిష్ఠానం మాత్రం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చే యోచనలో ఉన్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వాళ్లకు టికెట్ ఇవ్వాలని కొందరు అంటుంటే, గెలిచి గ్రామాలను అభివృద్ధి చేసే వారికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు.
News November 28, 2025
NIEPVDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<
News November 28, 2025
స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనాలు

AP: దోమల నివారణకు ఉపయోగించే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు తేలింది. ఇటీవల విజయవాడలోని ఓ షాపులో తనిఖీలు చేసి స్లీప్‌వెల్ అగరబత్తీల నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్కు పంపగా ప్రాణాంతక కెమికల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


