News August 3, 2024

ప్రభుత్వం నుంచి ఏమాత్రం ప్రోత్సాహం లేదు: షూటర్ అర్జున్

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ అర్జున్ బబుతా త్రుటిలో కాంస్యాన్ని చేజార్చుకున్నారు. స్వరాష్ట్రం పంజాబ్‌కు చేరుకున్న ఆయన, అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఇప్పటి, గత ప్రభుత్వాలు నాకెటువంటి ప్రోత్సాహాన్నీ ఇవ్వలేదు. ఉద్యోగంపై సీఎం మాన్ 2022లో హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదు. చాలా లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వాలు మారినా స్పందన మాత్రం ఉండటం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News March 4, 2026

అల్లు ఫ్యామిలీని చూశారా?

image

అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ‘అందమైన జంటపై ఆశీస్సులు కురిపించారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపారు. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మీ ప్రేమ, ఆప్యాయతకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 2న అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

News March 4, 2026

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబులు!

image

ఇరాన్ తమ భూభాగంపైకి బాలిస్టిక్ మిస్సైళ్లతో క్లస్టర్ బాంబులు వదులుతోందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. టెల్ అవీవ్ సమీపంలో ఈ బాంబు వల్ల 12 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది గాల్లో ఉన్నప్పుడే 80 చిన్న బాంబులుగా విడిపోయి కొన్ని కి.మీ. మేర విధ్వంసం సృష్టిస్తాయి. కొన్నిసార్లు పేలకుండా దశాబ్దాల పాటు భూమిలో ఉండిపోతాయి. ఏదైనా తాకితే పేలిపోతాయి. ఈ యుద్ధంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి.

News March 4, 2026

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. 18న ప్రారంభం

image

AP: దివ్యాంగులకు బస్సులో ఉచిత ప్రయాణం(ఇంద్ర ధనుస్సు స్కీమ్)పై RTC MD బాలసుబ్రహ్మణ్యం కీలక ప్రకటన చేశారు. ఈ పథకాన్ని ఈ నెల 18న సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చన్నారు. వారికి సహాయంగా వచ్చేవారికీ 50 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు.