News March 21, 2024

సచివాలయంలోకి ప్రజలకు నో ఎంట్రీ

image

TG: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుకు ఈసీ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. దీంతో పథకాలు, కార్యక్రమాలపై ప్రభావం పడుతోంది. మంత్రులను కలిసేందుకు వచ్చే ప్రజలు, సందర్శకులను సచివాలయంలోకి అనుమతించడం లేదు. అత్యవసర పనులు ఉంటే తప్ప సెక్రటేరియట్‌లోకి అనుమతిపై ఆంక్షలు విధించారు. మరోవైపు కోడ్ రాకతో పోలీస్, ఈసీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా తరలించే నగదును పట్టుకుని సీజ్ చేస్తున్నారు.

Similar News

News November 12, 2025

బాల్య వివాహాలు ఎలా మొదలయ్యాయి?

image

బాల్య వివాహాలు ముందు నుంచే లేవు. క్రీస్తు పూర్వం 4 సంవత్సరం నుంచి ఇవి మొదలయ్యాయి. బొమ్మల పెళ్లిళ్లు వీటికి దోహదం చేశాయి. పరదేశీయులు దండయాత్రల్లో తమకు చిక్కిన ఆడపిల్లలను చెరిపేవారు. ఇలాంటి దుస్థితి రాకూడదని తల్లిదండ్రులు తమ బిడ్డలకు త్వరగా పెళ్లి చేసి అత్తారిండ్లకు పంపేవారు. అయితే ఈ సంస్కృతి కారణంగానే ఆడపిల్లలు వేదాలు చదవడం, విద్యను అభ్యసించడం నిషిద్ధం అనే దుష్ప్రచారం మొదలైంది. <<-se>>#Pendli<<>>

News November 12, 2025

భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు.. కనిష్ఠంగా 8.7 డిగ్రీలు నమోదు

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. నిన్న తెలంగాణలో అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠంగా ఆసిఫాబాద్‌లోని లింగాపూర్‌లో 8.7 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో 14.7, మచ్చబొల్లారం, గచ్చిబౌలిలో 15 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించింది. రాబోయే రోజుల్లో టెంపరేచర్లు మరింత పడిపోతాయని హెచ్చరించింది.

News November 12, 2025

32,438 పోస్టులు.. రేపటి నుంచి అడ్మిట్ కార్డులు

image

రేపటి నుంచి గ్రూప్-D <<17650787>>పరీక్షలకు<<>> సంబంధించి అడ్మిట్ కార్డులు అందుబాటులోకి రానున్నట్లు RRB(రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) తెలిపింది. 32,438 పోస్టులకు ఈ నెల 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పరీక్షలు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది. పరీక్షలకు 4 రోజుల ముందు నుంచి ఈ-కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చంది. ఎగ్జామ్‌కు 10 రోజుల ముందుగానే పరీక్ష తేదీ, సిటీ వివరాలను RRB వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.