News September 6, 2024

కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు: CM చంద్రబాబు

image

AP: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని CM చంద్రబాబు అన్నారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు సాయం విషయంలో కేంద్రంతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామన్నారు. బీమా కట్టిన వారందర్నీ త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు.

Similar News

News October 10, 2024

కేటీఆర్ మాటలు మూసీ కంటే ఎక్కువ కంపు: ఎమ్మెల్యే మధుసూదన్

image

TG: హరియాణాలో కాంగ్రెస్ ఓడిపోయి BJP గెలిచినందుకు కేటీఆర్ సంబరాలు చేసుకుంటున్నారని MLA మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. అక్కడ ఈవీఎంల అవకతవకలు త్వరలో బయటపడతాయన్నారు. కేటీఆర్ మాటలు మూసీ కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని ఫైరయ్యారు. మూసీ ప్రక్షాళనపై డీపీఆర్ సిద్ధం కాకముందే రూ.లక్ష కోట్ల అవినీతి అంటున్నారని దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారం చేస్తే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 3 సీట్లు కూడా రావన్నారు.

News October 10, 2024

పాత రూల్స్‌తో మళ్లీ టీటీడీలో టెండర్లు: YCP

image

AP: టీటీడీలో మళ్లీ పాత నిబంధనలతోనే కూటమి సర్కార్ నెయ్యి కొనుగోలుకు నోటిఫికేషన్ ఇచ్చిందని వైసీపీ పేర్కొంది. ‘నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. గతంలో జగన్ ప్రభుత్వం విధించిన నిబంధనలు మార్చకుండా మళ్లీ అవే రూల్స్‌తో టెండర్లు పిలిచారు. అంటే వైసీపీ ప్రభుత్వం గట్టి నిబంధనలు అమలు చేసినట్లే కదా. కల్తీకి ఆస్కారం లేనట్లే కదా. సమాధానం చెప్పు చంద్రబాబు’ అని Xలో ప్రశ్నించింది.

News October 10, 2024

కొండా సురేఖకు కోర్టు నోటీసులు

image

TG: నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కొండా సురేఖ అసత్య ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.