News November 11, 2024

ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపా: CM

image

TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 కూడా నిర్వహించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 2011లో చివరిసారిగా గ్రూప్-1 నిర్వహించారని, దాదాపు 13 ఏళ్ల పాటు పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపానని, ఎంపికైన వారికి త్వరలో నియామకపత్రాలు అందిస్తానని పేర్కొన్నారు.

Similar News

News December 8, 2024

ధర్నాలకు కేరాఫ్‌ తెలంగాణ: బీఆర్ఎస్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలోని సబ్బండవర్గాలు ఆందోళన బాట పట్టాయని BRS ట్వీట్ చేసింది. KCR పాలనలో అభివృద్ధిలో పరుగులు తీసిన రాష్ట్రం, నేడు రేవంత్‌ ప్రభుత్వం వల్ల సంక్షోభంలో కూరుకుపోయిందని పేర్కొంది. నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, ఆఖరికి పోలీసులు కూడా రోడ్డెక్కారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని, సమస్యలు చెప్పుకునేందుకు కూడా కాంగ్రెస్ అవకాశం ఇవ్వడం లేదని విమర్శించింది.

News December 8, 2024

PM కిసాన్ రూ.12వేలకు పెంచాలని డిమాండ్

image

వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను ఒక శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. PM కిసాన్ వార్షిక సాయాన్ని ₹6K నుంచి ₹12Kకు పెంచాలని కోరారు. PM ఫసల్ బీమా యోజన కింద సన్నకారు రైతులకు జీరో ప్రీమియంతో ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రీబడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో విన్నవించారు. పురుగుమందులపై GSTని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని PHD ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రతిపాదించింది.

News December 8, 2024

OTTలోకి వచ్చేసిన ‘కంగువా’

image

శివ డైరెక్షన్‌లో సూర్య నటించిన కంగువా మూవీ OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలైంది. సూర్య నటనకు ప్రశంసలు దక్కినా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. బాబీ డియోల్, దిశా పటానీ, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.